The Danish Girl Movie Review : 2015 లో వచ్చిన విదేశీ సినిమా ది డానిష్ గర్ల్ (The Danish Girl). 1920లో వచ్చిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ మూవీ ఇది. ఇది నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ. Hetero sexuality నుంచి Gayగా మారటం కథాంశం. చిత్రకారులైన లిల్లీ ఎల్బే (భర్త) ఇంకా హెర్డే (భార్య).. ఆనందంగా గడిచిపోతున్న వీరి వైవాహిక జీవితంలోకి ఓ తుపానులాంటి సంఘటన ఎదురవుతుంది.
Kichha Sudeep Hairstyle : రూ.1 లక్ష పెడితే, రూ.2.75 కోట్లు వచ్చాయి! సినిమా వాళ్ల కథే వేరబ్బా..
భర్తలో పెళ్లయిన అయిదేళ్లకు స్త్రీ లక్షణాలు కనిపించడం. దానికి ఒకింత ఆమె కారణం కావడం గమనార్హం. కొన్నేళ్లుగా ఆమె వేసే చిత్రాలకు గుర్తింపు ఆదరణ కరువవడంతో ఒక లేడీ మోడల్ కోసం భర్తను ఎంచుకోడం. అతనిపై వైట్ గౌన్ కప్పి చిత్రం గీయటంలో ఆమె తలమునకలయుంటే అతనిలో ఎక్కడో నిగూఢంగా దాగిన వుమన్ లక్షణాలు చిత్రంగా పలికిన తీరు అద్భుతం. ఆ మౌన సన్నివేశం ఎన్నో భావ చిత్రాలకు ప్రతీక.
అలా కొన్నిరోజులు భార్యకు తెలీకుండా లేడీ గెటప్ లో తయారై తనను తాను చూస్కుని మురిసిపోతుంటాడు. “మగాళ్లకు వాళ్ల అతిశయంపై ఎంత మూఢ నమ్మకమో ఆడ వాళ్లకు వాళ్ల ఆడతనంపై అంత కన్సర్న్ వుంటదేమో”. అందువల్లే ఆమెగా మారడానికి అతనికి సహకరించి వుంటది.
అలా కొన్నిరోజులు అటు ఇటు కానీ హృదయం తో అల్లాడిపోతుంటే భార్య గుర్తించి జాలిపడి/ పోరాడి/ఏడ్చి/వ్యతిరేకించి చివరికి అతనికి సపోర్ట్ గా నిలుస్తుంది. ఆ సంఘర్షణను ఆమె అద్భుతంగా తెరపై పండించింది. ఇక అతను హార్మోన్స్ ఆటలో బీభత్సంగా ఓడిపోయి తన మగతనాన్ని పక్కకు నెట్టి కంప్లీట్ స్త్రీగా మారడానికి వైద్యలను కలుస్తాడు. డాక్టర్స్ ప్రాణ హాని వుందని వారించినా వినకుండా లింగమార్పిడి ఆపరేషన్ కు సిద్ధమవుతాడు. అది వికటించి బ్లీడింగ్ ఎక్కువై చనిపోతుంది తాను కోరుకునే లిల్లీగా.
Natural Star Nani : నాని ‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే..
ఆమె అతని పెయింటింగ్స్ ద్వారా బాగా ఫేమసవుతది.
చివర్లో అతను చనిపోయే ముందు డైలాగుంటది
“Now I Feel like I am a Woman”
అని. ఇంకా అతను వేసుకునే చున్నీ ఆమె చేతిలో నుంచి జారి గాల్లో నాట్యం చేస్తూ ఫ్రీగా ఎగిరిపోయే సన్నివేశంతో సినిమా ముగుస్తుంది. ఆ చున్నీ తన ఫ్రీ సోల్ ని సూచిస్తుంది. అది అతడికి భార్య ఇచ్చిన ప్రేమ కానుక. అపుడు సిగ్గు/మొహమాటంతో తిరస్కరించినా తర్వాతర్వాత దాన్ని మెడలో వేసుకుంటాడు(ది).