Valari Review : సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ మూవీతో టాలీవుడ్, కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్. బాక్సింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన రితికా, అనుకున్నట్టుగా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. రితికా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘వళరి’… ఈ సినిమా నేరుగా ఓటీటీ యాప్ ‘ఈటీవీ విన్’లో మార్చి 6న విడుదలైంది. మహిళా దర్శకురాలు మృతికా సంతోషిని ఈ సినిమాకి డైరెక్టర్..
నేవీలో పని చేసే హీరో శ్రీరామ్, తన భార్య రితికా, కొడుకుతో కలిసి చెన్నైలో ఉంటాడు. రితికాకి చిత్ర విచిత్రమైన కల వస్తుంది. కొన్ని రోజుల తర్వాత కలలో జరిగిన సంఘటనలే, ఆమె జీవితంలో జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటికి వచ్చింది? అనేదే ‘వళరి’ సినిమా కథ..
Premalu Review : క్యూట్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ..
రితికా సింగ్ మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్‌తో అందర్నీ అబ్బురపరిచింది. హీరో శ్రీరామ్, ఉత్తేజ్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాలో హార్రర్ సీన్స్ బాగా ఎలివేట్ అయినా, థ్రిల్లర్‌లా ఆఖరి వరకూ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ క్రియేట్ చేయడంలో ‘వళరి’ విఫలమైంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి బడ్జెట్ సరిపోలేదని చాలా సీన్లలో అనిపిస్తూ ఉంటుంది. డైరెక్టర్ సంతోషిని తీసుకున్న సబ్జెక్ట్‌ని అనుకున్నట్టుగా ప్రెజెంట్ చేసినా, ఆమెకు మిగిలిన విభాగాల నుంచి పూర్తి సహకారం లభించలేదు…
ఎడిటింగ్‌లో చాలా సీన్స్ ఇంకా తగ్గించవచ్చు. అలాగే విష్ణు టీఎస్ ఇచ్చిన మ్యూజిక్ కొన్ని సీన్స్‌ని ఎలివేట్ చేసినా, కీలకమైన సీన్స్‌కి పూర్తి న్యాయం చేయలేకపోయింది. హార్రర్ సినిమాలు ఇష్టపడే వారికి ‘వళరి’ నచ్చొచ్చు. అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆశించి, చూస్తే మాత్రం నిరాశపడడం ఖాయం..