Gaami Review : సినిమా, సినిమాకి వైవిధ్యం చూపించే విశ్వక్ సేన్, ‘గామి’ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ దాకా అభిమానుల అంచనాలను పెంచేసిన ‘గామి’, ఆ అంచనాలను అందుకోవడం సక్సెస్ అయ్యిందా?
ఓ జైలు నుంచి బయటపడేందుకు ప్రయత్నించే ఇద్దరు ఖైదీలు, దేవదాసి వ్యవస్థ నుంచి బయటపడిన ఓ అమ్మాయిని మళ్లీ అందులోకి లాగాలని ప్రయత్నించే ఊరు పెద్దలు.. మనిషి స్పర్శ తాకితే శరీరం రంగు మారిపోయే వింత వ్యాధితో బాధపడే ఓ అగోరా… ఈ మూడు కథల సమాహారమే ‘గామి’..
కర్మ సిద్ధాంతంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ‘గామి’ అదే ఫార్ములాని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తుంది. డైరెక్టర్ విద్యాధర్ కగిత, తాను అనుకున్న కథను తెర మీద ప్రెజెంట్ చేయడంలో అద్భుతంగా సక్సెస్ అయ్యాయి… అయితే తొలి సినిమా దర్శకుడు కావడంతో కొన్ని చోట్ల కథ, కథనం స్లో అయినట్టు అనిపిస్తాయి..
ఈ సినిమా చేయడానికి అంగీకరించినప్పుడే విశ్వక్ సేన్ ఓ మెట్టు ఎక్కేశాడు. అగోరా పాత్రలో విశ్వక్ సేన్, కొన్ని సీన్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చాందిని చౌదరి, మహ్మద్, హారిక అందరూ జీవించేశారు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది..
కొన్ని సీన్స్, హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశారు. నరేష్ కుమారన్ ఈ సినిమా తర్వాత పెద్ద సినిమా అవకాశాలు దక్కించుకుంటాడు.
ఇలాంటి సినిమాలు చూడాలంటే ఓపిక కచ్ఛితంగా ఉండాలి. మాస్ మసాలా కమర్షియల్ సినిమా హంగులను ఆశించేవారికి, ఈ సినిమా ప్రత్యేకత అర్థం కాదు.. తెలుగు తెర మీద ఇలాంటి సినిమాలు వస్తాయి. ఇదే మలయాళంలో, తమిళ్లో వస్తే సూపర్ హిట్ చేసే తెలుగువాళ్లు, మన తెలుగువారి సరికొత్త ప్రయత్నాన్ని ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి..