Vishwak Sen Gaami : విశ్వక్ సేన్ సినిమాకి A సర్టిఫికెట్.. గామి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తుందా..

Vishwak Sen Gaami : విశ్వక్ సేన్ నటిస్తున్న ‘గామి’ సినిమా, శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల అవుతోంది. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యాక్షన్ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా సాగే ‘గామి’ మూవీకి అడల్ట్స్ ఓన్లీ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఇందులో ఉన్న కొన్ని యాక్షన్ సీన్స్, అఘోరాల సీన్స్ కారణంగా ‘గామి’ చిత్రానికి అడల్ట్ సర్టిఫికెట్ దక్కింది.

Pushpa 2 : బన్నీ – సుక్కు కాంబోకి దిమ్మతిరిగే ఆఫర్..

ఈ మధ్య A సర్టిఫికెట్ తెచ్చుకున్న ‘యానిమల్’, ‘సలార్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చేశాయి. సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ మూవీ వరల్డ్ వైడ్ రూ.900 కోట్లు వసూలు చేసింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కి ‘సలార్’ ఊరటనిచ్చింది. రూ.720 కోట్లు రాబట్టి, సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇదే సెంటిమెంట్ వర్కవుట్ అయితే విశ్వక్ సేక్‌కి భారీ హిట్టు దక్కినట్టే.

తొలుత కేవలం రూ.25 లక్షల బడ్జెట్‌తో 45 నిమిషాల సినిమాగా మొదలైన ‘గామి’, నాలుగేళ్లు షూటింగ్‌కి, ఏడాదిన్నర గ్రాఫిక్స్‌కి కలుపుకుని… రూ.30 కోట్లకు చేరింది. విశ్వక్ సేన్ మార్కెట్‌కి ఇది చాలా ఎక్కువే. అయితే ఇప్పుడున్న క్రేజ్‌కి జనాలకు కనెక్ట్ అయితే ‘గామి’ సినిమా ఈజీగా రూ.50 కోట్ల మార్కును దాటేస్తుందని అంచనా..

Vishwak Sen : ఇక ప్రయోగాలు చేయను, బాక్సాఫీస్‌ని తగలబెడతా..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post