Kalki 2898AD : ‘కల్కి’లో మరో లెజెండరీ యాక్టర్.. ఇంకెంత మంది ఉన్నారయ్యా..

Kalki 2898AD : ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా గురించి ఒక్కో అప్‌డేట్ ఇస్తూ, ఆ అంచనాలను రెండింతలు చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మహా భారతంతో మొదలై, కల్కీ అవతారంతో సినిమా ముగుస్తుందని నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లు, అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేశాయి.. ‘కల్కి’ మూవీలో విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మృణాల్ ఠాకూర్, రానా దగ్గుపాటి ఇలా ఎందరో స్టార్లు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.

Varun Tej : ఆపరేషన్ కూడా పాయే! ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్..

తాజాగా ‘కల్కి’ సినిమాలో తాను కూడా నటించానని నట కిరిణీ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. అలాగే రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ‘కల్కి’ మూవీలో నటించానని చెప్పాడు. ఈ మూవీలో ఆచార్య పాత్రలో తాను కనిపిస్తానని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. అలాగే రాజమౌళి కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడని ప్రచారం జరిగింది..

ఇంతమంది స్టార్లను నింపిన నాగ్ అశ్విన్, అభిమానులను ఎలా సంతృప్తి పరుస్తాడనేదే చాలా పెద్ద ప్రశ్న… ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు, ‘కల్కి’ మూవీలో ప్రధాన తారాగణం. ఈ మూవీ విడుదలైతే కానీ నాగ్ అశ్విన్ సృష్టించిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు.. మే 9న ‘కల్కి’ సినిమా విడుదల అవుతోంది.

Kichha Sudeep Hairstyle : రూ.1 లక్ష పెడితే, రూ.2.75 కోట్లు వచ్చాయి! సినిమా వాళ్ల కథే వేరబ్బా..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post