Pushpa 2 : అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు కల్ట్ క్లాసిక్ సినిమాలుగా నిలిచాయి. ఈ కాంబోలో వచ్చిన ‘పుష్ప 1: ది రైజ్’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయినా, బాలీవుడ్లో రూ.100 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ‘పుష్ప 2’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కచ్ఛితంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు..
Kichha Sudeep Hairstyle : రూ.1 లక్ష పెడితే, రూ.2.75 కోట్లు వచ్చాయి! సినిమా వాళ్ల కథే వేరబ్బా..
దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమాకి థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా రూ.700 కోట్ల ఆఫర్ వచ్చిందట. అంటే బెంచ్ మీదే ఐదు రెట్ల లాభాలు వచ్చేసినట్టే. అయితే థియేటర్ల నుంచి ఈ మొత్తం తిరిగి రాబట్టాలంటే బాక్సాఫీస్ దగ్గర కనీసం రూ.500 కోట్లు తిరిగి రాబట్టాల్సిందే… పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ‘సలార్’ మూవీ కూడా హిందీలో రూ.150 కోట్ల వరకూ తీసుకురాగలిగింది..
Chiranjeevi : పాన్ ఇండియా మూవీ రిజెక్ట్ చేసిన మెగాస్టార్..
తెలుగులో మంచి వసూళ్లు వచ్చినా, అల్లు అర్జున్, తెలుగు మార్కెట్‌ని ప్రభాస్ మార్కెట్‌తో పోల్చడం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ‘అల వైకుంఠపురంలో’ సినిమా రూ.200 కోట్ల వరకూ రాబట్టగలిగింది. ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ సినిమా అంతకు రూ.150 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుంది..