Chaari 111 Review : వెన్నెల కిషోర్ సేమ్ సీన్ రిపీట్..

Chaari 111 Review : స్టార్ కమెడియన్‌గా మారినా హీరోగా ఇప్పటికే అరడజను సినిమాలు చేశాడు వెన్నెల కిషోర్. అయితే అందులో ఒక్క సినిమా కూడా వెన్నెల కిషోర్‌కి సక్సెస్ ఇవ్వలేదు. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా వచ్చిన మరో సినిమా ‘ఛారి 111’. సీక్రెట్ ఏజెంట్, డిటెక్టివ్ కాన్సెప్ట్‌తో చాలా కామెడీ సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి. మరి ‘ఛారి’ అందులో చేరాడా?

Pawan Kalyan : నా నాలుగో పెళ్లానివి నువ్వే..!

హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్‌లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దాని వెనక ఉన్న కుట్రను ఛేదించడానికి డిటెక్టివ్ సీక్రెట్ ఏజెంట్‌గా ఛారి నియమించబడతాడు. అతని సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? అందులో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఇదే ‘ఛారి 111’ సినిమా… కేవలం కామెడీ సీన్స్ మాత్రమే రాసుకున్న దర్శకుడు, లాజిక్‌ని గాలికి వదిలేశాడు. అందుకే కామెడీ ప్రారంభంలో బాగున్నా, సినిమా సాగే కొద్దీ నవ్వు రాకపోగా విసుగు తెప్పిస్తుంది.

హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్‌తో చేసిన యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సీరియస్ సబ్జెక్ట్‌ని తీసుకుని, దాన్ని కామెడీ చేయాలని చేయడం వరకూ ఆలోచన బాగానే ఉన్నా, లాజిక్ కూడా జోడించి ఉంటే… వెన్నెల కిషోర్‌కి సక్సెస్ దక్కి ఉండేది. వెన్నెల కిషోర్ హీరోగా వచ్చిన సినిమాల్లో మిగిలిన వాటి కంటే ఇది కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు.

Natural Star Nani : నాని ‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post