Kichha Sudeep Hairstyle : ఇండియాలో సినిమా హీరోలకు, క్రికెటర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సౌత్‌లో అయితే హీరోయిన్లకు గుళ్లు కట్టేసిన చరిత్ర కూడా ఉంది. అలాంటి క్రేజ్ ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడంతో తప్పు లేదు. అందుకే బ్రాండ్ అంబాసిడర్స్ పేరుతో కోట్లకు కోట్లు సంపాదిస్తుంటారు సెలబ్రిటీలు.
Mahesh Babu : ఇష్టమైన థియేటర్‌ని కొనేసిన మహేష్ బాబు..
హెబ్బులి సినిమా కోసం సుదీప్, ఓ వైపు పొడవాటి జట్టుతో, మరో వైపు చిన్నగా కత్తిరించుకుని డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హెయిర్ స్టైయిల్ కోసం చిత్ర యూనిట్ రూ.1 లక్ష ఖర్చు చేసిందట. విభిన్నమైన హెయిర్ స్టైల్‌లో ఉన్న కిచ్ఛా సుదీప్ పోస్టర్ ద్వారా ఏకంగా రూ.2.75 కోట్లు వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర నిర్మాత ఉమాపతి తెలియచేశాడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అతిథి’ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ హెయిర్ స్టైల్ కోసం దాదాపు రూ.70 లక్షలు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ లుక్ బాగానే క్లిక్ అయినా సినిమా పెద్దగా క్లిక్ కాలేదు.. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించాడు. ఈ మేకోవర్ కోసం కూడా బాగానే ఖర్చు చేశారు.
Tollywood vs Kollywood : పిచ్చి, వెర్రి, అంతకుమించి.. సోషల్ మీడియాలో టాలీవుడ్ vs కోలీవుడ్ రచ్చ..