Mahesh Babu PhonePe Ad: 5 సెకన్ల వాయిస్‌కి అన్నీ కోట్లా..! మహేష్ రేంజ్ చూస్తే మైండ్ బ్లాకే..

Mahesh Babu PhonePe Ad: టాలీవుడ్‌లో బ్రాండ్ బాబు అంటే మహేష్ బాబే. A ఫర్ అమృతాంజన్ నుంచి Z ఫర్ జీ తెలుగు దాకా అల్ఫాబెటిక్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ రకాల బ్రాండ్స్‌కి ప్రమోషన్స్ చేస్తున్నాడు మహేష్ బాబు. టాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లోనే మహేష్ చేసేన్నీ యాడ్స్ వేరే ఏ హీరో చేయడం లేదు. సినిమాల కంటే యాడ్స్‌ కోసమే ఎక్కువ కష్టపడతాడనే ట్రోలింగ్ కూడా ఉంది మహేష్‌పైన..

Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?

ప్రస్తుతం రాజమౌళితో సినిమా కమిట్ అయ్యాడు మహేష్. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. లుక్ లీక్ కాకుండా ఉండేందుకు మూడేళ్ల పాటు పూర్తిగా పార్టీలకు, బయటి ఫంక్షన్లకు దూరం కాబోతున్నాడు మహేష్ బాబు. అంతేకాదు యాడ్స్ చేయడానికి కూడా వీల్లేదని రాజమౌళి కండీషన్ పెట్టాడు.

అయితే క్రేజ్ ఉంటే చాలు.. కనిపించకుండా, వినిపించి డబ్బులు సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు మహేష్. ఫోన్ పే యూపీఐ కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫోన్ పేలో డబ్బులు పంపితే, ‘రూ.50 రూపాయలు! మీ ఫోన్‌ పేలో రిసీవ్ చేయబడ్డాయి’ అని వాయిస్ ఓవర్ వస్తుంది. దీనికి మహేష్ వాయిస్ పెట్టి, చివర్లో ‘థ్యాంక్యూ బాస్’ అని యాడ్ చేశారు. ఇలా 5 సెకన్ల వాయిస్ వాడినందుకు, రూ.5 కోట్లు తీసుకున్నాడట మహేష్.. అంటే సెకనుకి రూ.1 కోటి! మహేష్‌కి ఉన్న క్రేజ్‌కి ఆ మాత్రం ఇవ్వాల్సిందేలే..

క్రేజీ కాంబో.. గురూజీతో డార్లింగ్..

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post