అల్లోపతి V/S ఆయుర్వేదం..

Difference Between Allopathic And Ayuvedic Medicines
Difference Between Allopathic And Ayuvedic Medicines

Difference Between Allopathic And Ayuvedic Medicines : ఇంట్లో వాళ్లకో, మనకో, తెలిసిన వాళ్లకో, ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. వెంటనే దగ్గరలో అందుబాటులో ఉన్న డాక్టర్ని కలుస్తాం. ఆయన లేక ఆమె చెప్పిన మెడిసిన్ కొద్ది రోజులు వాడి చూస్తాం. తగ్గకపోతే ఈ డాక్టర్ తో ఇంకా అయ్యే వ్యవహారం కాదని, ఇంకో పెద్ద హాస్పిటల్ కి వెళ్తాం. అక్కడ ఒక నెల రోజులు, అక్కడ కూడా తగ్గకపోతే ఎవరో చెప్పారని మరొక హాస్పిటల్, ఆ తర్వాత ఇంకొక డాక్టర్ ఇలా టైంపాస్ అవుతూనే ఉంటుంది. మన హెల్త్ ప్రాబ్లం తగ్గదు సరి కదా డబ్బులు మాత్రం అయిపోతూనే ఉంటాయి.

ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..

అలా కాకుండా ఉండాలంటే ఏ హెల్త్ ప్రాబ్లంకి ఏ వైద్యం బెటర్ మనకి వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుంది అన్న అవగాహన ఉంటే బాగుంటుంది. దానివల్ల డబ్బు వృథా కాకుండా కరెక్ట్ వైద్యం తొందరగా అదుతుంది. దాంతో మన హెల్త్ ప్రాబ్లం కూడా తొందరగా నయం అవుతుంది.

Difference Between Allopathic And Ayuvedic Medicines

వ్యాధుల్లో రెండు రకాలు ఉంటాయి
* తాత్కాలిక వ్యాధులు
* దీర్ఘకాలిక వ్యాధులు

15 రోజుల్లోపు తగ్గిపోయే హెల్త్ ప్రాబ్లం అయితే అది తాత్కాలికం. నెల రోజుల్లో కూడా తగ్గలేదు అంటే అది దీర్ఘకాలిక వ్యాధే. సింపుల్ గా  చెప్పాలంటే తాత్కాలిక హెల్త్ ప్రాబ్లమ్స్ కి అలోపతి అంటే ఇంగ్లీష్ మందులు తీసుకోవచ్చు.

ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..

అల్లోపతి :
* నిర్లక్ష్యం చేయడం వల్ల కానీ, మనం గుర్తించలేకపోవడం వల్ల కొన్ని వ్యాధులు ముదిరి ప్రాణం మీదకి వచ్చినప్పుడు అర్జెంటుగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.
* యాక్సిడెంట్, ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు
* ఏవైనా రోగాలు బారిన పడి ఆపస్మారక స్థితికి లోనైనప్పుడు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి వైద్యం అందించుకోవాలి. అత్యవసరం వైద్య అవసరాలు తీర్చడంలో అలోపతికి మించిన టెక్నాలజీ లేదు అప్పుడు వాళ్లే దేవుళ్ళు.

ఆయుర్వేదం :
అలాకాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రం, ఆయుర్వేద వైద్య విధానం ఎంచుకోవడం మంచిది. ఆయుర్వేదం రూట్ లెవెల్ లో పని చేసి, దీర్ఘకాలిక రోగాలను తగ్గిస్తుంది.
ఆయుర్వేదంలో హెల్త్ ప్రాబ్లం తగ్గడానికి టైం పట్టినా ఆరోగ్యాన్ని పెంచుతూ రోగాన్ని తగ్గిస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్య తల ఎత్తినప్పుడు రోగాన్ని గుర్తించి క్షుణ్ణంగా పరిశోధించి అది తగ్గేందుకు ఏ వైద్య విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందో దాన్నే అనుసరించాలి. సరైన సమయానికి సరైన ట్రీట్మెంట్ జరిగితే ఆరోగ్యం కూడా తొందరగా మెరుగుపడుతుంది.

23 రోజులు, 35 లక్షల పెళ్లిళ్లు.. 4.25 లక్షల కోట్ల రూపాయలు! రికార్డు లెవెల్లో మోగనున్న పెండ్లి భాజాలు..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post