Pawan Kalyan : ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాల్లో, 3 లోక్‌సభ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు కూడా. అయితే ఈ ప్రకటన రాగానే జనసేన పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది.. పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటు బ్యాంకు లేకపోయినా, ఆయన్ని సీఎంగా చూడాలని కొంతమంది వీరాభిమానులు కలలు కంటున్నారు.
TDP & Janasena : తెలుగుదేశం – జనసేన అభ్యర్థుల తొలి జాబితా..
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని తెలిసినా, పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతాడని అనుకున్నారు. అయితే మొత్తంగా 175 సీట్లలో జనసేన 24 స్థానాల్లో మాత్రమే పోటీలో నిలిస్తే, ఒకవేళ టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడినా పవన్ కళ్యాణ్‌కి సీఎం కుర్చీ దక్కడం అసాధ్యం.
దీంతో ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్‌లో ఓ లీడర్ కనిపించాడని, ఇప్పుడు మాత్రం ఓ రాజకీయ నాయకుడిలా తయారయ్యాడంటూ జనసేనాని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. అయితే పవన్ మాత్రం పొత్తు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు. గత ఎన్నికల్లో కనీసం ఒక్క చోట గెలవకపోయినవాళ్లం, ఇన్ని సీట్లు కావాలని ఎలా అడగలం? అంటూ అభిమానులను నిలదీస్తున్నాడు.
అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో పదేళ్ల క్రిందట జనసేన పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీచేసిన జనసేన, ఒకే ఒక్క సీటుకి పరిమితమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయాడు. అయినా ఐదేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేస్తే.. ఏడు చోట్ల కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.
Bramayugam Review : మమ్మూట్టీ నట విశ్వరూపం..