Nagarjuna Akkineni : సౌత్‌లో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్‌కి పాన్ వరల్డ్ లెవెల్లో క్రేజ్ ఉంటే, మెగాస్టార్‌కి కూడా పొరుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో వీళ్లిద్దరూ ముందున్నా, ఆస్తులు, సంపాదన మాత్రం అక్కినేని నాగార్జున టాప్‌లో ఉన్నాడు.
Chiranjeevi : పాన్ ఇండియా మూవీ రిజెక్ట్ చేసిన మెగాస్టార్..
అక్కినేని నాగేశ్వరరావు వారసుడైన నాగార్జున మొత్తం ఆస్తుల విలువ రూ.3010 కోట్లు. ఈ విషయంలో రజినీకాంత్ కంటే 7 రెట్లు ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడు నాగ్.. రజినీకాంత్ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.430 కోట్లు.. ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా. ఆస్తుల కూడగట్టే విషయంలో రజినీ వెనకబడ్డారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి సొంత ఆస్తుల విలువ రూ.970 కోట్ల దాకా ఉంది. అన్నపూర్ణ స్టూడియోతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాగార్జున చేసిన పెట్టుబడులు బాగా కలిసి రావడంతో ఆయన దక్షిణ భారతంలోనే రిచెస్ట్ నటుడిగా నిలిచాడు. అధికారిక లెక్కల ప్రకారం నాగ్ ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి బినామీ అకౌంట్లలో ఆస్తులు పెట్టేవాళ్ల అసలు ఆస్తులు లెక్కబెడితే ఇంతకు రెండింతలు ఉండొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయం.
Harish Shankar Fire on Websites : సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్..