TDP & Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ప్రతిపక్షం పొత్తు కుదిరింది. కలిసి పోటీ చేస్తామని ప్రకటించినా చివరి వరకూ ఈ పొత్తు ఉండడం అనే అనుమానాలు రేగాయి. అయితే ఎట్టకేలకు సీట్ల పంపకం విషయంలో రెండు పార్టీలకు సంధి కుదిరింది. వచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లలో పోటీ చేస్తుంది. మొత్తంగా 175 సీట్లలో జనసేనకి 24 సీట్లు దక్కగా మిగిలిన 151 స్థానాల్లో తెలుగు దేశం పోటీ చేయనుంది.
జైలుకి వెళ్లి వస్తే చాలు, సీఎం పదవి! అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, నెక్ట్స్ బాబు..?
అలాగే లోక్ సభలో టీడీపీ 22 స్థానాల్లో పోటీ చేయనుంది. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకోవాలని ఆలోచిస్తే, నిర్ణయం తీసుకుంటామని కామెంట్ చేశాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం-జనసేన పొత్తులో భాగంగా తెనాలి నుండి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తాడని అధిష్టానం ప్రకటించింది..
తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ.. జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు. ఇతర నియోజకవర్గాల వివరాలు, అభ్యర్థుల పేర్లు 2 రోజుల్లో ప్రకటించబోతున్నారు.
వైసీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని NRI అరెస్ట్.. తల్లిని చూసేందుకు వస్తే..