Anushka Shetty : శీలావతిగా మారిన అనుష్క శెట్టి..

Anushka Shetty : ‘సైజ్ జీరో’ సినిమా కారణంగా భారీగా బరువు పెరిగిపోయిన అనుష్క శెట్టి, ఆచితూచి సినిమాలు చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మంచి హిట్టు కొట్టిన అనుష్క, ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది.ఈ మూవీకి ‘శీలావతి’ అనే టైటిల్ కూడా అనుకుంటోంది చిత్ర యూనిట్.

Harihara Veeramallu : అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు టీమ్..

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఇంతకుముందు ‘వేదం’ మూవీలో నటించింది అనుష్క శెట్టి. ఆ మూవీలో సరోజా అనే వేశ్య పాత్రలో నటించింది… ఎగిరిపోతే ఎంత బాగుంటుందని సొంతంగా కంపెనీ పెట్టుకోవాలని అనుకుంటుంది. ‘శీలావతి’ మూవీలో అలాంటి పాత్రలోనే అనుష్క కనిపించబోతుందని టాక్. ఆలియా భట్ నటించిన ‘గంగూబాయ్ కథాయ్‌వాడి’ తరహాలో ఓ సెక్స్ వర్కర్ల గ్యాంగ్‌కి లీడర్‌గా అనుష్క కనిపించబోతుందని టాక్ వినబడుతోంది. ఈ మూవీని దాదాపు రూ.50 కోట్లతో తెరకెక్కించబోతున్నారు.

పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీర మల్లు’ మూవీ చేస్తున్నాడు క్రిష్ జాగర్లమూడి. నాలుగేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ ఆగిపోయిందని, అందుకే క్రిష్, అనుష్కతో మూవీ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆగిపోలేదని, ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోందని చిత్ర యూనిట్ ఖరారు చేసింది.

Vijay Sethupathi : ఆ మాట మీద నిలబడిన విజయ్ సేతుపతి.. అందుకే రామ్ చరణ్ మూవీ నుంచి అవుట్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post