Naga Chaitanya Thandel : ఎన్టీఆర్‌తో పోటీకి సై అంటున్న నాగచైతన్య..

Naga Chaitanya Thandel : ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ ‘దేవర’ ఏకంగా ఆరు నెలలు వాయిదా పడింది. అక్టోబర్ 10న ‘దేవర’ పార్ట్ 1 విడుదల అవుతుందని అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇంకో 40 రోజుల షూ టింగ్ మిగిలి ఉండగా, డ్యూయెట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ మేలోపు పూర్తి అయినా, రిలీజ్ డేట్, హాలీడేస్ కోసం అక్టోబర్ దాకా వెళ్లింది ఎన్టీఆర్ మూవీ.

Naga Chaitanya Thandel : ఆ రెండు సినిమాల్ని కలిపి కొడుతున్న చైతూ… తండేల్ వర్కవుట్ అయితేనా..

చెప్పడానికి అక్టోబర్ 10 అని ప్రకటించినా, ఒకవేళ అల్లు అర్జున్, ఆగస్టు 15 నుంచి ‘పుష్ప 2’ మూవీని సైడ్ చేస్తే, ఆ ప్లేస్‌లో ‘దేవర’ వస్తాడట. అంటే ‘పుష్ప 2’ విడుదల ఆలస్యమైతే, బన్నీ డేట్‌‌కి ఎన్టీఆర్, ‘దేవర’ తేదీకి అల్లు అర్జున్ వస్తారన్నమాట..

అయితే చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న ‘తండేల్’ మూవీ కూడా దసరా రిలీజ్‌పైనే ఫోకస్ పెట్టిందట. అక్టోబర్ 11న ‘తండేల్’ మూవీని థియేటర్లలోకి తేవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకా 8 నెలల గ్యాప్ ఉండడంతో అప్పటిలోపు ఏమైనా జరగొచ్చు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండడంతో ‘తండేల్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Sai Pallavi : ఆ విషయంలో సాయిపల్లవి, నిజంగా హైబ్రీడ్ పిల్లే..

జూన్-జూలై నెలల్లో వస్తుందనుకున్న ‘తండేల్’ కూడా అక్టోబర్ దాకా వెళ్లడానికి వీఎఫ్‌ఎక్స్ పనులే కారణం. పాకిస్తాన్‌లో బందీ అయిన శ్రీకాకుళం జాలరి పాత్రలో చైతూ నటిస్తున్న ‘తండేల్’ మూవీని అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post