Bhamakalapam 2 Review : 2022లో ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన ‘భామా కలాపం’ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దానికి కొనసాగింపుగా రెండేళ్లకు సీక్వెల్‌ని రిలీజ్ చేసింది యూనిట్. ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఏమవుతుందో తెలుసుకోవాలనే ఉత్సాహం కాస్త ఎక్కువగా ఉన్న అనుపమ, ఆ తుత్తర వల్ల ఓ హత్య కేసులో ఇరుక్కోవాల్సి ఉంటుంది. అది మొదటి పార్ట్‌లోనే చూపించారు.
Rajadhani Files Review : ఏపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రం..
రూ.200 కోట్ల ఖరీదైన బంగారు కోడి గుడ్డు కోసం పార్ట్ 1 జరిగితే, రెండో పార్ట్‌లో ఏకంగా అది వెయ్యి కోట్ల రూపాయల బంగారు కోడి పుంజు దాకా వెళ్లింది.. గుడ్డు పొదిగి పుంజు అయ్యే సరికి, కథలోకి సీరత్ కపూర్ వంటి గ్లామరస్ రోల్ కూడా వచ్చేసింది.. ఇందులో కూడా ప్రియమణి పాత్ర మలిచిన విధానం, ఆమె వల్ల పని మనిషి శరణ్య ఎదుర్కొనే ఇబ్బందులు, సమస్యలే హైలైట్..
సస్పెన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి, కథను అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ అభిమన్యు తడిమేటి బాగా సక్సెస్ అయ్యాడు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ కూడా సన్నివేశాలను రక్తి కట్టించగలిగింది..
Mahesh Babu : శ్రీమంతుడే కాదు.. మహర్షి కూడా నాదే..
అయితే మొదటి పార్ట్‌లాగే రెండో పార్ట్ కూడా సెకండాఫ్‌లో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తొలి పార్ట్‌లో ప్రెగ్నెంట్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రను చంపకుండా కాపాడి ఉండొచ్చని అనిపిస్తుంది. అలాగే డ్రామా కోసం రెండో పార్ట్ ప్రీ క్లైమాక్స్‌ని కాస్త లాగిన ఫీలింగ్ కలుగుతుంది. దాన్ని కాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే, ‘భామా కలాపం 2’ మొదటి పార్ట్ కంటే బాగా కుదిరేది… ‘ఆహా’ యాప్‌లో విడుదలైన ఈ మూవీలో పెద్దగా అడల్ట్ సీన్స్, బూతులు కూడా లేవు. కాబట్టి కుటుంబ సమేతంగా కలిసి చూసేయొచ్చు..