Mahesh Babu : టాలీవుడ్లో ఏడాదికి 160 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో 10-15 మాత్రమే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో కూడా కొత్త కథలు రావడం ఎప్పుడో ఆగిపోయింది. ఉన్న కథలనే అటు మార్చి, ఇటు మార్చి తీస్తున్నారు దర్శకులు.. 10 ఏళ్ల క్రితం ఓటీటీలు లేకపోవడం వల్లే తెలుగు ప్రేక్షకులు ఏం తీసినా చూశారని, ఇప్పుడు ఏం చేసినా దొరికిపోతున్నామని స్వయంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించాడు.
Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?
తాజాగా కొరటాల శివ తీసిన శ్రీమంతుడు మూవీ, తన నవల నుంచి కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర కేసు వేసి గెలిచాడు. దర్శకుడి నుంచి దాదాపు రూ.2 కోట్ల నష్టపరిహారం ఆశిస్తున్న శరత్ చంద్ర, ఇప్పుడు మహర్షి సినిమాని కూడా టార్గెట్ చేశాడు. ఈ మూవీ కూడా తన నవలలో సీన్స్ నుంచే కాపీ చేశారంటూ ఆరోపణలు చేశాడు శరత్ చంద్ర. త్వరలో ఆ చిత్ర దర్శక నిర్మాతలకు కూడా నోటీసులు పంపుతానంటూ స్పష్టం చేశాడు.
ఇప్పటిదాకా వంశీ పైడిపల్లి ఆరు సినిమాలు తీశాడు. ఇందులో ఏ మూవీ కథ కూడా కొత్తగా ఉండదు. ‘మున్నా’ నుంచి ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’, ‘మహర్షి’, ‘వారిసు’ అన్నీ కూడా ఇంతకుముందు సినిమాలను మిక్సీలో వేసి రుబ్బినట్టుగా కథ, కథనాలు అల్లుకుని తీసినవే. అయితే అన్నీ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడాయి.. కొరటాల శివ దొరికిపోయాడు, మరి వంశీ పైడిపల్లి ఈ కాపీ రైట్ కేసును ఇలా ఫేస్ చేస్తాడో చూడాలి.
క్రియేటివిటీ లేనప్పుడే హింస, సెక్స్ వాడతారు.. వైరల్ అవుతున్న ఆమీర్ ఖాన్ కామెంట్లు..