Vijay Sethupathi : ఆ మాట మీద నిలబడిన విజయ్ సేతుపతి.. అందుకే రామ్ చరణ్ మూవీ నుంచి అవుట్..

Vijay Sethupathi : రామ్ చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గత ఏడాది రజినీ ‘జైలర్’ మూవీలో కనిపించింది, కొంతసేపే అయినా తన స్క్రీన్ ప్రెసెన్స్‌తో విజిల్స్ వేయించాడు శివరాజ్‌కుమార్. ఆ తర్వాత ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలోనూ ఓ చిన్న రోల్ చేశాడు.

Rajanikanth Lal Salaam : జైలర్‌తో సూపర్ హిట్టు! అంతలోనే ముంచేసిన ఐశ్వర్యా..

ఇప్పుడు రామ్ చరణ్ మూవీలోనూ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. వాస్తవానికి ఈ రోల్ కోసం విజయ్ సేతుపతిని సంప్రదించాడట డైరెక్టర్ బుచ్చిబాబు. మొదటి సినిమా ఉప్పెనలో విజయ్ సేతుపతి, హీరోయిన్‌ తండ్రిగా నటించాడు. అయితే ఈ ఏడాది ‘మేరీ క్రిస్మస్’ సినిమాతో బాలీవుడ్‌లోకి వెళ్లిన విజయ్ సేతుపతి, ఇకపై క్యారెక్టర్ రోల్స్ చేయనని చెప్పాడు. కేవలం డబ్బు కోసం క్యారెక్టర్ రోల్స్ చేయాల్సి వచ్చిందని, ఇకపై అలాంటివి చేయనని తేల్చి చెప్పాడు విజయ్ సేతుపతి.

అందుకే రామ్ చరణ్ సినిమాలో రోల్ చేయడానికి విజయ్ సేతుపతి నో చెప్పాడట. ఆ క్యారెక్టర్‌లో పవర్ ఫుల్ నటుడి కోసం చూస్తున్న బుచ్చిబాబు, జైలర్ చూశాక శివ రాజ్‌కుమార్‌ని సంప్రదించాడని టాక్.. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోందని టాక్. అయితే ఇప్పటిదాకా చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు..

Fighter Director : విమానం ఎక్కని లో-క్లాస్ జనాలకు నా సినిమా వాల్యూ ఎలా తెలుస్తుంది..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post