Rajanikanth Lal Salaam : డైరెక్టర్‌ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు! ఓ పడవను నడిపించాలంటే కేవలం చేతిలో స్ట్రీరింగ్ పట్టుకుని, అటు ఇటూ తిప్పడం మాత్రమే తెలిస్తే సరిపోదు.. పడవకు సంబంధించిన ప్రతీ విషయంపై పట్టు ఉండాలి. పడవలోని సిబ్బందిని కంట్రోల్‌లో పెట్టుకోగలగాలి.. అప్పుడే మంచి కథ, మంచి సినిమాగా మారుతుంది. లేదంటే ఎంత మంచి కథ ఉన్నా, అవుట్‌ఫుట్ తేడా కొట్టేస్తుంది. ఇప్పుడు ‘లాల్ సలాం’ కూడా అలాంటిదే..
Ram Charan Bollywood : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చెర్రీ..
పెద్దగా కథ లేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ‘జైలర్’ మూవీతో రూ.650 కోట్లు వసూలు చేశాడు రజినీ కాంత్. అదే పవర్ ఫుల్ కథ, కథనం జోడించి ఉంటే, రూ.1000 కోట్లు రాబట్టగల ఇమేజ్ రజినీ సొంతం. అయితే తండ్రి కావడంతో అప్పుడు సౌందర్య, ఇప్పుడు ఐశ్వర్య ఇద్దరూ రజినీతో డిజాస్టర్లే తీశారు. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్‌ఎక్స్ మూవీ తీస్తానని చెప్పి, ‘కొచ్చాడియన్’ పేరుతో ఓ బొమ్మల సినిమాని తండ్రి చేతిలో పెట్టింది సౌందర్య రజినీకాంత్..
Mega Family : లక్ష్మీదేవి పుట్టింది, లక్ తీసుకొచ్చింది.. పవన్ ఏపీ సీఎం కావడమే బాకీ..
ఇప్పుడు ఓ పవర్ ఫుల్ రోల్ అంటూ ‘లాల్ సలాం’ మూవీలో రజినీని ఇరికించింది ఐశ్వర్య. ‘జైలర్’ సూపర్ హిట్టు ఇచ్చిన సంతోషం కొన్నిరోజులు కూడా మిగలకుండా, ‘లాల్ సలాం’ మూవీతో భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ జీరో షేర్ వసూలు చేసింది. చాలా థియేటర్లలో జనం రాక షోస్ క్యాన్సిల్ అయ్యాయి. రజినీ ఉన్న సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. కూతురు ఐశ్వర్య దర్శకురాలు కాకపోయి ఉంటే, రజినీ ఈ మూవీలో నటించేవాడు కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..