Lal Salaam Review : రజినీకాంత్ సినిమా వస్తుందంటే ఉండే హడావుడి మామూలుగా ఉండదు. సినిమా చూసేందుకు హాలీడే ఇవ్వాలని కార్పొరేట్ ఆఫీసులకు మెయిల్స్ వెళ్తాయి. అయితే ఈరోజు రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందనే విషయమే చాలామందికి తెలీదు. రజినీకాంత్, తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో చేసిన ‘లాల్ సలాం’ సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఎంత సైలెంట్‌గా అంటే రిలీజ్ రోజు ఒక్క థియేటర్ దగ్గర కూడా హౌస్‌ఫుల్ బోర్డు పడలేదు..
Suhas Hattric : లాభాల్లోకి వచ్చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు..
40 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. ఓ ఊరు, అందులో రెండు మతాల మధ్య జరిగే గొడవలు. ఆ గొడవలు ఆపేందుకు పెట్టిన క్రికెట్ మ్యాచ్.. ఇదే లాల్ సలాం స్టోరీ. క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అని ఊహిస్తే, నిరాశ తప్పదు. విష్ణు విశాల్, విక్రాంత్ కీ రోల్స్ చేశారు. అయితే ఈ ఇద్దరికీ గొడవలు జరగడానికి బలమైన కారణాలు ఉండవు. నిరోషా తన స్టైల్లో అదరగొట్టినా, మిగిలిన పాత్రలకు తగిన స్కోప్ లేదు..
మరోసారి ఐశ్వర్య డైరెక్షన్లో ఫ్లాప్ అయ్యింది. సినిమాలో తండ్రి చేసిన కొన్ని సీన్స్, పవర్ ఫుల్‌గా ప్రెజెంట్ చేయడం తప్ప మిగిలిన పార్ట్ అంతా తేలిపోయింది. విష్ణు రంగస్వామి కథ బాగున్నా, స్క్రీన్ ప్లే తేలిపోయింది. ఏ. ఆర్. రెహమాన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్ని సరిగ్గా వాడుకోలేకపోయారు.
Animal Controversy : నీ కొడుకు వెబ్ సిరీస్‌లో బూతులు పెట్టి, నాకు నీతులు చెబుతావా..!?
రజినీ గెస్ట్ రోల్‌కి ఎక్కువగా ఉండే 20 నిమిషాల రోల్ చేశాడు. తెలుగులో రజినీకి మనో కాకుండా సాయికుమార్ డబ్బింగ్ చెప్పడంతో సూపర్ స్టార్ సినిమా చూస్తున్న ఫీల్ కలగదు. మొత్తంగా ‘లాల్ సలాం’లో సలాం కొట్టే సీన్స్ ఏమీ లేకపోవడంతో సినిమాకెళ్లిన ఫ్యాన్స్ ముఖాల మీద లాల్ మిగిలింది… కేవలం సబ్జెక్ట్ లేని సినిమాకి కాస్త హైప్ తేవడానికి తండ్రి cameo వాడినట్టుగా అనిపిస్తుంది.