Animal Controversy : నీ కొడుకు వెబ్‌ సిరీస్‌లో బూతులు పెట్టి, నాకు నీతులు చెబుతావా..!?

Animal Controversy : యానిమల్ మూవీతో బాలీవుడ్‌ని షేక్ చేసి పడేశాడు సందీప్ రెడ్డి వంగా. అయితే ఈ సినిమాపై వచ్చిన, వస్తున్న విమర్శలకు లెక్కే లేదు. అల్ఫా మేల్ అని, పురుషాహంకారాన్ని రుద్దుతున్నారని, మహిళలను కించపరుస్తున్నారని సందీప్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సీనియర్ నటుడు జావెద్ అక్తర్ కూడా ఈ మూవీ గురించి కొన్ని విమర్శలు చేశాడు.

Sembi Movie : చట్టాలు మార్చలేని ఛిద్రమైన బతుకు కథ..

‘మహిళను బూట్లు నాకమని చెప్పడం, కొట్టడం వంటి సీన్లు, సమాజానికి మంచివి కావు. అవి సూపర్ హిట్ కావచ్చు కానీ, ఇలాంటి సన్నివేశాలు భావి తరాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి..’ అంటూ వ్యాఖ్యానించాడు జావెద్ అక్తర్..

‘నిత్యా మీనన్ లాంటి మంచి మనసున్న ఆర్టిస్ట్ నుంచి ఇలాంటి కామెంట్లు వస్తే, నేను కచ్ఛితంగా అంగీకరిస్తాను.. కానీ జావెద్ సాహెబ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆయన కొడుకు ఫర్హాన్ అక్తర్ ప్రొడ్యూస్ చేసిన మీర్జాపూర్ సిరీస్‌ని ఆయన చూడలేదా? లోకంలో ఎన్ని బూతులు ఉన్నాయో అన్నీ ఒక మీర్జాపూర్ షోలోనే ఉన్నాయి. కొన్ని తెలుగులో డబ్ అయిన ఓ 15 సీన్లు మాత్రమే చూశాను.

Modi vs Advani : అప్పుడలా.. ఇప్పుడిలా.. మోదీ కపట ప్రేమ..

అలాంటి వాటి వల్ల సోసైటీకి ఎలాంటి చెడు జరగదా? మిగిలిన వాళ్ల వర్క్ మీద కామెంట్లు చేసేటప్పుడు, మన చుట్టూ చూసుకోవడం మంచిది…. ’ అంటూ కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ‘కబీర్ సింగ్’ తర్వాత వచ్చిన విమర్శల కారణంగా ‘యానిమల్’ మూవీ మరీ వైలెంట్‌గా తీసిన సందీప్, ఈసారి వస్తున్న ట్రోల్స్‌కి ‘యానిమల్ పార్క్’ మూవీలో ఇంకా ఎలాంటి సీన్లు ప్లాన్ చేస్తాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post