Rajinikanth Lal Salaam : 4 రోజుల్లో రజినీకాంత్ సినిమా రిలీజ్‌.. బజ్ లేదు, హైప్ లేదు..

Rajinikanth Lal Salaam : రజినీకాంత్ సినిమా వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. ‘శివాజీ’, ‘కబాలి’, ‘జైలర్’ వంటి రజినీకాంత్ సినిమా రిలీజ్ రోజు, కార్పొరేట్ ఆఫీసులకు సెలవులు కూడా ఇచ్చారు. తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు, నార్త్‌లో కూడా రజినీకాంత్ మూవీపైన విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన గంటల్లోనే హౌస్ ఫుల్ అయిపోతాయి.

Guntur Kaaram OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మహేష్ గుంటూర్ కారం..

మరో 4 రోజుల్లో రజినీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ మూవీ రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న ‘లాల్ సలాం’ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్, విగ్నేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీలో రజినీకాంత్ 30 నిమిషాల స్పెషల్ రోల్ చేశాడు.

అయితే రజినీమీదే ఫోకస్ పెట్టి, ప్రచారం చేస్తోంది చిత్ర యూనిట్.. ఈ సినిమాలో రజినీకాంత్ కేవలం అరగంట మాత్రమే కనిపిస్తాడని టాక్. అందుకే ‘లాల్ సలాం’ మూవీకి అనుకున్నంత క్రేజ్ రావడం లేదు. ఈ మూవీని రజినీ కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ డైరెక్ట్ చేయడం మరో విశేషం.

Pawan Kalyan OG : ఆ ఇద్దరు హీరోలతో పోటీ పడుతున్న పవర్ స్టార్..

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post