Guntur Kaaram OTT : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ‘గుంటూర్ కారం’ మూవీ, చాలా ఏరియాల్లో భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దాదాపు రెండు రాష్ట్రాల్లో 90 శాతం థియేటర్లలో రిలీజైన గుంటూర్ కారం మూవీ, 10 రోజుల పాటు రూ.1 కోటి షేర్ రాబట్టగలిగింది. అయితే భారీ ధరకు రైట్స్ అమ్మడంలో 75 శాతం వరకూ మాత్రమే రికవరీ అయ్యింది. చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్’ మూవీ వల్ల, గుంటూర్ కారం మూవీకి చాలా నష్టమే వచ్చింది.
Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?
జనవరి 12న విడుదలైన గుంటూర్ కారం మూవీ, ఫిబ్రవరి 9న ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. అంటే సరిగ్గా నెల రోజులు కూడా కాకుండానే 28 రోజుల్లో ఓటీటీ రిలీజ్ జరుగుతోంది. జనవరి 13న విడుదలైన ‘సైంధవ్’ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 14న విడుదలైన ‘నా సామి రంగ’ మాత్రం ఫిబ్రవరి 15న ఓటీటీలో విడుదల అవుతోంది.
జనవరి 12న గుంటూర్ కారంతో పోటీపడి రిలీజ్ అయిన హనుమాన్ మాత్రం మార్చి 22 తర్వాతే ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే రూ.250 కోట్లు వసూలు చేసిన ‘హనుమాన్’ మూవీ, ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. లాంగ్ రన్ ఉంటుందని ముందుగానే గ్రహించిన చిత్ర టీమ్, 50 రోజుల తర్వాతే ఓటీటీ రిలీజ్‌కి అగ్రిమెంట్ చేసుకుంది.
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?