Fighter Director : మొదటి 3 రోజుల్లో రూ.250 కోట్లు వసూలు చేసిన హృతిక్ రోషన్ ఫైటర్, ఆ తర్వాత అలిసిపోయాడు. బీ, సీ సెంటర్లలో ఈ మూవీని జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు. మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్ థియేటర్లలో బాగానే ఆడుతున్నా, పెట్టిన బడ్జెట్‌కి, వచ్చిన రిటర్న్స్‌కి పొంతన లేకపోవడంతో హృతిక్ రోషన్ కెరీర్‌లో మరో ఫ్లాప్ చేరినట్టే అని ఫిక్స్ అయిపోయారు ట్రేడ్ పండితులు..
Poonam Pandey Death : చావుతో జోక్స్ ఏంటి పాప..!
‘పఠాన్’ మూవీతో రూ.1100 కోట్ల వసూళ్లు సాధించిన సిద్ధార్థ్ ఆనంద్, ఈ ‘ఫైటర్’ మూవీకి డైరెక్టర్. అంతకుముందు ‘వార్’, అంజనా అంజానీ, బచ్‌నా ఏ హసీనా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్, ‘ఫైటర్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌తో షాక్ అయ్యాడు.
వచ్చిన ఫ్లాప్‌ని స్వీకరించాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి. కానీ పాజిటివ్ రివ్యూలు వచ్చిన మూవీ, బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో నోరు జారాడు సిద్ధార్థ్ ఆనంద్. ‘మనదేశంలో 90 శాతం మంది తమ జీవితంలో ఎప్పుడూ విమానం ఎక్కలేదు. వీరిలో చాలామంది విమానాన్ని దగ్గర్నుంచి చూసి కూడా ఉండరు. అలాంటప్పుడు నేను తీసిన మాస్టర్ పీస్ ఫైటర్ మూవీ, వాళ్లకు ఎలా అర్థం అవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు సిద్ధార్థ్ ఆనంద్..
దీనికి నెటిజన్ల నుంచి తీవ్రమైన స్పందన వచ్చింది. జనాలంతా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం వల్లే ‘పుష్ప’ సూపర్ హిట్ అయ్యిందని ఒకరు అంటే, 90 శాతం జనాలు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనకపోయినా, RRR చూసి, ఇండస్ట్రీ హిట్ నిలిపారని మరొకరు కామెంట్ చేస్తారు.
Fighter Movie review: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రివ్యూ: అనుకున్నదానికంటే ఎక్కువే…
ఘాజీ అర్థం చేసుకోవాలంటే సబ్ మెరైన్ ఎక్కాలని, అవతార్ అర్థం అవ్వాలని ఏలియన్స్ అయ్యి ఉండాలని, రెడ్ లైట్ ఏరియాకి వెళ్లిన వాళ్లకు మాత్రమే ‘గంగూ భాయ్’ అర్థం అవుతుందని, మాహిష్మతి రాజ్యంలో ఉన్నవాళ్లకే ‘బాహుబలి’ మూవీ నచ్చాలని అన్నట్టుగా సిద్ధార్థ్ ఆనంద్ కామెంట్లు ఉన్నాయంటూ సిద్ధార్థ్ ఆనంద్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు..