Ayalaan OTT : అయలాన్ తెలుగు రిలీజ్ ఇక లేనట్టేనా..!?

Ayalaan OTT : శివకార్తీకేయన్ నటించిన తాజా చిత్రం ‘అయలాన్’. తమిళ్‌లో జనవరి 12న విడుదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతికి తెలుగులో నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం, థియేటర్ల సమస్య రావడంతో ‘అయలాన్’ తెలుగు డబ్ వర్షన్‌ని రెండు వారాలు వాయిదా వేశారు.. జనవరి 26న ఈ మూవీ తెలుగు వర్షన్ విడుదల కావాల్సింది.

Srimanthudu Controversy : మహేష్‌ ని కేసు నుంచి తప్పించిన నమ్రత..

అయితే ఆ రోజు ఈ మూవీతో పాటు ప్లాన్ చేసిన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ థియేటర్లలోకి వచ్చింది. అయితే ఫైనాన్షియల్ ఇబ్బందులతో ‘అయలాన్’ తెలుగు రిలీజ్ మాత్రం విడుదలకు నోచుకోలేదు. వారం దాటినా ఇప్పటిదాకా కొత్త రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించలేదు చిత్ర యూనిట్. తాజాగా ‘అయలాన్’ తమిళ్ ఒరిజినల్ ప్రింట్‌ని ఓటీటీలోకి రిలీజ్ కూడా చేసేశారు. తమిళ్ ప్రింట్ రావడంతో దాన్ని సబ్ టైటిల్స్‌తో తెలుగు వాళ్లు చూసేస్తున్నారు.

తమిళ్ ప్రింట్‌ హెచ్‌డీ వర్షన్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు వర్షన్ థియేటర్లలోకి వచ్చినా అంతగా రెస్పాన్స్ రాకపోవచ్చు.. చూస్తుంటే తెలుగు వర్షన్‌ కూడా నేరుగా ఓటీటీలోకే వచ్చేలా కనిపిస్తోంది. ‘అయలాన్’ మూవీతో పాటు రిలీజ్ అయిన ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగులో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. ఈ మూవీ ఫిబ్రవరి 9న ఓటీటీలో రెండు భాషల్లో ఒకే సారి విడుదల అవుతోంది.

Ayalaan Telugu Version : ఆగిన ‘అయలాన్’ తెలుగు మూవీ రిలీజ్.. రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వని చిత్ర యూనిట్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post