Bollywood : బాలీవుడ్‌ పనైపోయిందా..!?

Bollywood : చాలా ఏళ్ల తర్వాత ‘పఠాన్’ మూవీతో తిరిగి బాలీవుడ్ బాక్సాఫీస్‌కి తిరిగి కళ తీసుకొచ్చాడు షారుక్ ఖాన్. అలాగే ‘జవాన్’ మూవీతో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు షారుక్. అయితే ఈ మూవీ తమిళ దర్శకుడు అట్లీ తీసింది. ఈ రెండు సినిమాల తర్వాత తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి, ‘యానిమల్’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.

Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?

బాలీవుడ్‌లో వచ్చిన గత 3 సినిమాల్లో 2 సౌత్ దర్శకులు ఇచ్చినవే. సల్మాన్ ఖాన్ తీసిన ‘టైగర్ 3’ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. అలాగే షారుక్ ‘డంకీ’ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర ఆ మ్యాజిక్ కనిపించలేదు. తాజాగా హృతిక్ రోషన్ తీసిన ‘ఫైటర్’ కూడా వీక్ డేస్‌లో కలెక్షన్లు రాబట్టడానికి తెగ కష్టపడుతోంది. తొలి 4 రోజులు ‘ఫైటర్’ మూవీకి మంచి వసూళ్లు వచ్చాయి.

ఈ మూవీ ఈజీగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అనుకున్నారంతా. అయితే సండే తర్వాత ‘ఫైటర్’ కలెక్షన్స్ ఒక్కసారిగా 80 శాతం పడిపోయాయి. మల్టీప్లెక్సుల్లో కాస్త నిలకడగా బుకింగ్స్ జరుగుతున్నా, బీ, సీ సెంటర్లలో కలెక్షన్లు నిల్. సినిమా సూపర్ హిట్ కావాలంటే ఈ సెంటర్ల జనాలు, సినిమాకి కనెక్ట్ కావాలి. కానీ అది జరగడం లేదు. టైగర్ 3, డంకీ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు హృతిక్ ‘ఫైటర్’ విషయంలోనూ అదే జరుగుతోంది.

సలార్ vs డంకీ.. హద్దులు దాటుతున్న ఫ్యాన్ వార్! సినిమాల కోసం..

‘ఫైటర్’ మూవీకి ‘పఠాన్’ తీసిన సిద్ధార్థ్ ఆనందే డైరెక్టర్. అందులో దీపికా పదుకొనే బికినీ వేస్తే వర్కవుట్ అయ్యిందని, ‘ఫైటర్’లోనూ అదే రిపీట్ చేశాడు. ‘పఠాన్’ కంటే ‘ఫైటర్’కి మంచి రివ్యూలు వచ్చాయి, అయినా కలెక్షన్లు మాత్రం పూర్తిగా పడిపోయాయి. చూస్తుంటే బాలీవుడ్ పనైపోయినట్టే ఉందని, సౌత్ దర్శకుల సాయం లేకుండా బాలీవుడ్ నిలబడడం కష్టమేనని అంటున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post