Ayalaan Telugu Version : శివకార్తికేయన్ నటించిన ‘అయలాన్’ మూవీపై మంచి క్రేజ్ వచ్చింది. తమిళ్లో ఈ మూవీ జనవరి 12న విడుదలై, మంచి విజయం అందుకుంది. తెలుగులో రిప్లబిక్ డే కానుకగా జనవరి 26న ‘అయలాన్’ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్‌తో ‘అయలాన్’, జనవరి 26న విడుదల కాలేదు. కాస్త లేటుగా అయినా జనవరి 27న అయినా సినిమా విడుదల ఉంటుందని అనుకుంటే, అది కూడా జరగలేదు..
Tapsee pannu : యానిమల్’ లాంటి సినిమాల్లో నేనైతే నటించను
‘అయలాన్’ తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ గురించి చిత్ర యూనిట్ ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. శివకార్తికేయన్‌ని తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అతను నటించిన ‘డాక్టర్’, ‘కాలేజీ డాన్’, ‘ప్రిన్స్’, ‘మహావీరుడు’ చిత్రాలు తెలుగులో మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ‘అయలాన్’ తమిళ్లో మంచి బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంది. రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, యూఎస్‌లో ‘కెప్టెన్ మిల్లర్’ కంటే భారీ వసూళ్లు సాధించింది.
అయితే తమిళ్లో కూడా ‘అయలాన్’ మూవీ రిలీజ్ రోజున ఇబ్బందులు ఎదుర్కొంది. ఆర్థిక ఇబ్బందులతో మొదటి రెండు షోస్ క్యాన్సిల్ అయ్యాయి. అయితే ఫస్ట్ షో నుంచి సినిమా ప్రదర్శితమైంది. రెండు వారాల తర్వాత తెలుగులోకి వచ్చినా, ఈ సమస్యలను పరిష్కరించలేకపోయాడు నిర్మాత. తెలుగులో ‘అయలాన్’ మూవీని దిల్ రాజు డిస్టిబ్యూట్ చేస్తున్నాడు. ఆయన కూడా ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ గురించి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.
Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?