Jr NTR Devara : అనుకున్నట్టే వాయిదా పడిన ‘దేవర’.. కొంపముంచిన అనిరుధ్..

Jr NTR Devara : ‘ఆచార్య’ తర్వాత కొరటాల శివ కసిగా చేస్తున్న ‘దేవర’ మూవీ, గ్లిప్స్‌తోనే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఏది ఏమైనా ఏప్రిల్ 5న థియేటర్లలోకి ‘దేవర’ ని తీసుకొస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఈ మూవీ షూటింగ్ అనుకున్నట్టుగా సాగడం లేదు. సౌత్‌లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న అనిరుధ్ రవిచంద్రన్, ఇప్పటిదాకా ‘దేవర’ పాటలకు సంబంధించిన వర్క్ పూర్తి చేయలేదట..

Samantha :  అతన్ని గుడ్డిగా నమ్మి, మోసపోయా! సమంత కామెంట్స్ ఎవరి గురించి…?

దీనికి తోడు సైఫ్ ఆలీ ఖాన్ గాయంతో ఆసుపత్రి పాలవ్వడంతో ‘దేవర’ షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ గ్యాప్‌లో పాటలు షూట్ చేద్దామని, అనిరుధ్ ఇప్పట్లో ట్యూన్స్ ఇచ్చేలా లేడు. దీంతో ఏప్రిల్‌లో వద్దామనుకున్న ‘దేవర’, ఆగస్టు నాటికి వచ్చే అవకాశం ఉందని టాక్… ఆగస్టులో వద్దామనుకున్న ‘పుష్ప 2’ మూవీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందట..

ఇప్పటిదాకా ఈ మూవీ షూటింగ్‌ సగం కూడా కాలేదని సమాచారం. కేవలం రష్మిక మంధాన ఇంకా ఈ మూవీ కోసం 50 రోజుల డేట్స్ ఇచ్చిందట. రష్మిక పార్ట్ కోసమే 50 రోజుల షూటింగ్ బాకీ ఉంటే, అల్లు అర్జున్, ఫజల్ పాత్రల షూటింగ్ పార్ట్ ఇంకెంత ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ‘పుష్ప’ వచ్చిన నెలలోనే అంటే డిసెంబర్‌లోనే వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..

Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post