Balakrishna : హనుమాన్ డైరెక్టర్‌తో బాలయ్య బాబు.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే..

Balakrishna : సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీ, అదిరిపోయే కలెక్షన్లతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. హనుమంతుడి దెబ్బకు మహేష్ గుంటూర్ కారం, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామి రంగ పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. థియేటర్లు తక్కువగా ఇచ్చి, చిన్న సినిమాగా ట్రీట్ చేసినా, హనుమాన్ రోజురోజుకీ కలెక్షన్లు, థియేటర్లు పెంచుకుని, రూ.220 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

చరణ్ పేరు చెబితే చప్పట్లు కొట్టలేదు! యండమూరి చేతికి చిరంజీవి ఆటో బయోగ్రఫీ..

రూ.30 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో సూపర్ హీరో సినిమాని తెరకెక్కించి, అదరగొట్టాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీ దెబ్బకు ప్రశాంత్ వర్మతో పనిచేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఓ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట..

బాలయ్యబాబుతో ‘అన్‌స్టాపబుల్’ ప్రోగ్రామ్ చేసిన ప్రశాంత్ వర్మ, సీనియర్ స్టార్‌ని తన సినిమాటిక్ యూనివర్స్‌లోకి తేవాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే బాలయ్యకి రెండు కథలు చెప్పిన ప్రశాంత్ వర్మ, ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడట. బాలయ్య, ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటే… సూపర్ హీరో విన్యాసాలకు థియేటర్లు షేక్ అవ్వాల్సిందేనని అనుకుంటున్నారు అభిమానులు..

ఫ్లాప్ హీరోలకి హిట్టు దేవతగా మారిన శ్రుతి హాసన్.. ఆఖరికి ప్రభాస్‌కి కూడా..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post