Hanuman Collections : అక్కడ రూ.50 కోట్లు దాటేసిన ‘హనుమాన్’.. టాప్ 6లోకి ఎంట్రీ..

Hanuman Collections : సంక్రాంతికి పట్టుబట్టి, మహేష్ గుంటూర్ కారం మూవీతో రిలీజ్ అయ్యింది ‘హనుమాన్’. చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా తొక్కేస్తున్నారంటూ చేసిన ప్రచారం, పబ్లిసిటీకి అద్భుతంగా ఉపయోగపడంది. అన్నింటికీ తోడు సంక్రాంతికి వచ్చిన ‘గుంటూర్ కారం’ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్, ‘సైంధవ్’ని పట్టించుకోకపోవడం, ‘నా సామి రంగ’ కేవలం కొన్ని ఏరియాలకే వర్కవుట్ కావడంతో ‘హనుమంతుడు’ అంతంతై, వటుడింతయై అన్నట్టుగా ‘హనుమాన్’ మూవీ రికార్డులు కొల్లగొడుతూ దూసుకుపోతోంది.

DEVARA MOVIE UPDATE : సైఫ్ ఆలీ ఖాన్‌కి గాయం! సర్జరీ కూడా… 2 నెలల్లో ‘దేవర’ వచ్చేనా?

ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన మిగిలిన సినిమాల బాక్సాఫీస్ రన్ దాదాపు పూర్తి అయిపోయింది. అయితే ‘హనుమాన్’ మూవీ మాత్రం ఎక్కడ తగ్గకుండా రెండో వారంలోనూ రికార్డు కలెక్షన్లతో అదరగొడుతోంది. ఓవర్‌సీస్‌లో 4.5 మిలియన్ల మార్క్ దాటేసిన ‘హనుమాన్’ మూవీ, కేవలం ఇండియా బయటే రూ.50 కోట్లు రాబట్టింది..

రాజమౌళి సృష్టించిన బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాటు సలార్, సాహో చిత్రాలు మాత్రమే విదేశాల్లో ఈ ఫీట్ సాధించాయి. ఇప్పుడు ‘హనుమాన్’ ఈ జాబితాలో చేరిపోయింది.. ఇప్పటికే మంచి వసూళ్లు సాధిస్తున్న ‘హనుమాన్’ మూవీ, ఇప్పటికే రూ.220 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Samantha :  అతన్ని గుడ్డిగా నమ్మి, మోసపోయా! సమంత కామెంట్స్ ఎవరి గురించి…?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post