Tapsee pannu : యానిమల్’ లాంటి సినిమాల్లో నేనైతే నటించను

Tapsee Pannu : ‘యానిమల్’ లాంటి సినిమాల్లో నేనైతే నటించను! తాప్సి షాకింగ్ కామెంట్లు..

అవకాశాలు రాకపోయినా, ట్రెండింగ్‌లో ఎలా ఉండాలో తాప్సీ బాగా తెలుసు. చేసింది కొన్ని సినిమాలు అయినా, తన మార్క్ ఉండేలా సినిమాలు సెలక్ట్ చేసుకున్న తాప్పి పొన్ను, తాజాగా యానిమల్ మూవీ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

‘యానిమల్ లాంటి సినిమాల్లో నేను ఎప్పుడూ నటించను. ఎందుకంటే ఓ నటిగా నాకు ఈ సమాజంపైన చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నేను ఎప్పుడూ చులకనగా చూడను. కొంతమంది హాలీవుడ్ సినిమాలు చూస్తారు, మనవాళ్లు తీస్తే ఇలా మాట్లాడతారని అంటున్నారు. అవును, నిజమే కానీ హాలీవుడ్‌లో జనాలు సినిమాని సినిమాగానే చూస్తారు. ఇక్కడి వాళ్లు సినిమాను సొంతంగా ఫీల్ అవుతారు. హీరోలు ఏం చేస్తే అదే చేయాలని అనుకుంటారు. అందుకే సినిమా తీసే ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలి..’ అంటూ వ్యాఖ్యానించింది తాప్సి..

షారుక్ ఖాన్‌తో కలిసి చేసిన ‘డంకి’ మూవీ, ప్రభాస్ ‘సలార్’తో పోటీగా విడుదలై మంచి విజయం అందుకుంది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ కలెక్షన్లు చేస్తుందని అనుకుంటే.. సోసోగా రాబట్టింది.

Say No DP : సంస్కారం లేని టెక్నాలజీ..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post