Ap Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మార్చి-ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో నిలబడే అభ్యర్థలు జాబితాను నాలుగు విడుతలుగా విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…
అయితే వైసీపీ అభ్యర్థుల లిస్టు విడుదల అయ్యే కొద్దీ, ఆ పార్టీని వీడేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. మున్ముందు వైసీపీ నుంచి కాంగ్రెస్, టీడీపీలోకి వచ్చే నాయకుల సంఖ్య భారీగానే పెరిగేలా కనిపిస్తోంది..
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి పరిణామాలే జరిగాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నుంచి కొందరు నాయకులు తమ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈ వలసల కారణంగా బీఆర్ఎస్కే ఎక్కువ నష్టం జరిగింది. వరుసగా రెండు పర్యయాలు తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న భారతీయ రాష్ట్ర సమితి, ఈసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది..
మరి టీడీపీ ఈసారి అధికారంలోకి రావాలని గట్టిగా అనుకుంటోంది. జనసేనతో పొత్తు, ఎన్నికల్లో బాగా కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు, ఓట్లపై ప్రభావం చూపించే అవకాశం గట్టిగానే ఉంది. అదీకాకుండా ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే వైసీపీ, బీభత్సంగా ప్రచారం చేస్తూ ఇన్నాళ్లు జనాల్లో పెరిగిన నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది..
Read more AP Government :భారత్‌లో జనాలు అభివృద్ధి కంటే ఎక్కువగా సంక్షేమ పథ