Hyderabad: ఇప్పుడు జీవిత, అప్పట్లో విజయనిర్మల… డైరెక్షన్ చేసి, భర్త ఇమేజ్ డ్యామేజ్ చేసి…
టాలీవుడ్లో డైరెక్షన్ చేసిన మహిళల సంఖ్య చాలా తక్కువ. భానుమతి రామకృష్ణ, సావిత్రి, విజయ నిర్మల, జీవిత, బి. జయ, నందిని రెడ్డి.. ఇలా డైరెక్షన్ చేసిన మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టుకోవచ్చు. విజయ నిర్మల డైరెక్షర్గా మారిన తర్వాత ఎక్కువ సినిమాలు ఆయన భర్త కృష్ణతోనే చేసింది. జీవిత రాజశేఖర్ ఎక్కువగా వేరే భాషల్లో సూపర్ హిట్టైన సినిమాలను రాజశేఖర్‌తో తెలుగులోకి రీమేక్ చేసింది..
తమిళ్లో సూపర్ హిట్టైన ‘సేతు’ మూవీని తెలుగులో రాజశేఖర్‌తో ‘శేషు’ అని తీసిన జీవిత, హిందీ ఫిల్మ్ ‘ఖాకీ’ రీమేక్‌గా ‘సత్యమేవ జయతే’, ‘రిస్క్’ రీమేక్‌గా ‘మహంకాళి’ తీసింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లే. అలాగే మలయాళం మూవీ ‘జోసఫ్’ రీమేక్‌గా ‘శేఖర్’ మూవీ చేసింది. ఆ మూవీ కొన్ని కోర్టు కేసుల కారణాల వల్ల అనేక చిక్కులు ఎదుర్కొంది..
క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తీసిన ‘గరుడ వేగ’, వి. సముద్ర తీసిన ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలని కూడా చాలా భాగం తానే డైరెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది జీవిత.. అయితే ఇదే విధంగా అప్పట్లో విజయ నిర్మల కూడా భర్త చేసే సినిమాల్లో వేలు పెట్టేది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘సాహసమే నా ఊపిరి’ పేరుతో కృష్ణ హీరోగా ఓ సినిమా మొదలైంది..
అయితే ఈ మూవీ మొదలైన తర్వాత కథలో మార్పులు చేయాలని విజయ నిర్మల కోరడంతో క్రియేటివ్ డిఫరెన్సులతో దర్శకుడు దాసరి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో నిర్మాతలు కూడా ఈ మూవీని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో కథను తనకు నచ్చినట్టుగా మార్చుకుని, కృష్ణ, తన కొడుకు నరేశ్‌లతో ‘సాహసమే నా ఊపిరి’ మూవీని పూర్తి చేసింది విజయ నిర్మల. ఈ మూవీ నరేశ్‌కి కాస్త హెల్ప్ అయినా, కృష్ణ ఖాతాలో మరో డిజాస్టర్‌గా మిగిలింది..
అలాగే విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ‘ప్రజల మనిషి’, ‘యస్ నేనంటే నేనే’, ‘రెండు కుటుంబాల కథ’, ‘నేరము శిక్ష’ వంటి సినిమాలు కృష్ణ సినీ కెరీర్లో డిజాస్టర్లుగా నిలిచాయి.