Sai Kumari Idea : ‘మీ బిల్లు రూ.1000 అయ్యింది. రెండు లివర్ ఎక్స్‌ట్రా…’ డైలాగ్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కనిపించిన ఆమె పేరు సాయి కుమారి.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ఇన్‌ఆర్బిట్ మాల్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై మీల్స్ స్టాల్ ప్రారంభించింది సాయి కుమారి… అన్‌లిమిటెడ్ నాన్-వెజ్ మీల్స్ రూ.120 అని ప్రారంభమైన సాయికుమారి ఆంటీ హోటల్‌కి తక్కువ టైమ్‌లోనే మంచి పాపులారిటీ దక్కింది.
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?
ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్, వీడియోల కారణంగా ఈ ఆంటీ హోటల్‌కి వచ్చేవారి సంఖ్య డబుల్ అయ్యింది… సింగిల్ చికెట్ కర్రీ అయితే రూ.150, డబుల్ మిక్స్, త్రిబుల్ మిక్స్, ఆల్ మిక్స్.. ఇలా కర్రీలు పెరిగే కొద్దీ మీల్స్ రేటు కూడా పెరుగుతుంది… చూడడానికి ఫుట్‌పాత్ మీద పెట్టిన చిన్న వ్యాపారంలా కనిపిస్తున్నా, రోజుకి క్వింటాల్ రైసును అమ్ముతారట సాయి కుమారి.
రోజుకి రూ.30 వేల దాకా ఆదాయం వస్తుందని, ఖర్చులన్నూ పోను నెలకు రూ.3 లక్షల వరకూ లాభం మిగులుతుందని చెబుతోంది సాయి కుమారి… ఎంతో కష్టపడి చదివి, టాప్ పొజిషన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు కూడా ఇంత ప్యాకేజీ పొందడం లేదు.. కష్టపడి చదివి, కంపెనీ వాడిచ్చే రూ.20 వేల జీతం కోసం గొడ్డు చాకిరీ చేయడం కంటే ఇలా రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నా, దర్జాగా లక్షలు సంపాదించొచ్చని చాలామంది ఇటువైపు మళ్లాలని ఆలోచన చేస్తున్నారు.. సాయి కుమారి ఆంటీ వల్ల, ఉద్యోగాలు వదిలి, వ్యాపారాల వైపు వెళ్లే యూత్ పెరిగే అవకాశం బాగానే కనిపిస్తోంది.
యూట్యూబ్ స్టార్లతో సూపర్ హిట్లు! ఈ ఐడియా ఏదో భలేగా ఉందే..