Senior actor Chandra Mohan is no more : టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. నవంబర్ 11న తన స్వగృహంలో గుండెపోటుతో చంద్రమోహన్ తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలియచేశారు. 1943లో జన్మించిన చంద్ర మోహన్, దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు.. దర్శకుడు ‘కళా తపస్వి’ కె. విశ్వనాథ్ బంధువుగా సినిమాల్లోకి వచ్చిన చంద్ర మోహన్, అతికొద్ది కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
‘స్కంద’ ఫైట్ సీన్లో బోయపాటి శ్రీను.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..
1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చంద్ర మోహన్, 1978లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే ‘సిరి సిరి మువ్వ’ సినిమాలో నటనకు ఆయనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.
‘సీతామాలక్ష్మీ’, ‘రామ్ రాబర్ట్ రహీం’, ‘రాధా కళ్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘కురుక్షేత్రం’, ‘ప్రాణం ఖరీదు’, ‘శంకరాభరణం’, ‘శుభోదయం’, ‘పక్కింటి అమ్మాయి’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన చంద్ర మోహన్, హీరోగా ఫుల్లు బిజీగా ఉన్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మెప్పించారు. హీరోగా 175 సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. మొత్తం 932 సినిమాలు చేశారు.
‘చాలా బాగుంది’, ‘శ్రీ షిర్డి సాయిబాబా మహత్యం’, ‘వివాహ భోజనంబు’, ‘ప్రేమించి చూడు’, ‘జయంబు నిశ్చయంబు రా’, ‘ఆమె’, ‘చంద్ర లేఖ’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నువ్వే నువ్వే’, ‘నువ్వే లేక నేను లేను’, ‘సంతోషం’, ‘ఒక్కడు’, ‘7జీ బృందావన కాలనీ’ వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన చంద్ర మోహన్, చివరిగా గోపిచంద్ ‘ఆక్సిజన్’ సినిమాలో నటించారు.