Remembering Suryakantham : తెరపై గయ్యళి అయస్కాంతం.. తెరవెనుక మనస్కాంతం..

Remembering Suryakantham
Remembering Suryakantham

Remembering Suryakantham : పాత్ర వల్ల నటులకు పేరు రావటం సహజం. కానీ నటుల వల్ల పాత్రకు పేరు రావడం చాలా అరుదు. అటువంటి అరుదైన నటి సూర్యకాంతం గారు. తెలుగు తెరకు గయ్యాళి అత్త పాత్రలను పరిచయం చేసిన విలక్షణ నటి. పోషించే పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో ఆ పాత్రకు వన్నె తేవడమే కాదు, ఆమె తప్ప మరోనటి ఆ పాత్ర చెయ్యలేరు అన్నంతగా ఇమిడిపోయేవారు. ‘అత్తరికాన్ని’ చెలాయించి ప్రేక్షకుల గుండెలపై చెరగని ముద్ర వేసి, గయ్యాళి పాత్రలు అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తుకువచ్చే పేరు సూర్యకాంతం.

Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..

తెరపై ఆమె పోషించిన ప్రతి పాత్రలో హాస్యం, వ్యంగ్యం, చిలిపితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పాత్ర ఏదైన అందులో స్వాభావికంగా నటించడం ఆమెకు నటనతో పెట్టిన విద్య. ఆమె పేరు చెబితే తెలుగు కోడళ్లకు భయం. తెలుగు నేలపై ఆ పేరు పెట్టుకోవడానికి గానీ, పిలిపించుకోవడానికి గానీ ఎవరు ఇష్టపడరు. అంతలా తనపాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసిన నటి సూర్యకాంతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నటిసూర్యకాంతం ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి.

ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుంది అంటే ఆ సంతోషమే నాకు వద్దు” అని.. అలాంటి సున్నితమైన మనస్తత్వం కలిగిన ఆమె వెండితెరపై గయ్యాలి అత్తగా నటించి.. నటిగా గయ్యాళితనాన్ని కనబరిచిన ఆమె ఇలా నటన విషయంలో ఎంత చక్కగా తనను తాను మలుచుకుందో చెప్పడం వర్ణనాతీతం.

సూర్యకాంతం 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించారు. చిన్నతనంలో బాగా అల్లరి చేసేవారట. దాంతో అల్లరి అమ్మాయిగా ముద్ర పడిపోయారు. కాకినాడలో కాలేజీ చదివే రోజుల్లో హ్యాపీ క్లబ్‌లో వేసేవారు. అప్పుడే ఆమెకు అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడడంతో సినీ రంగంపై మక్కువ కలిగింది. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు చేశారు. వరద ప్రవాహంలా డైలాగులు చెప్పగలగడం ఆమెకున్న వరం.

లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే, ‘వీరభోగ వసంతరాయలు’ పుడతాడని ఎన్టీఆర్‌కి చెప్పిన జ్యోతిష్యుడు..

1946 నుంచి 1994 వరకు సూర్యకాంతం, దొంగ రాముడు, మాయాబజార్, తోడికోడళ్లు, వెలుగు నీడలు, కలసివుంటే కలదు సుఖం, మంచి మనసులు, రక్త సంబంధం, నర్తనర్తశాల, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి,ర ఆస్తిపస్తిపరులు, సుఖ దుఃఖాలు, ఉమ్మడి కుటుంబం, బుద్దిమంతుడు, దసరా బుల్లోడు, కాలం మారింది, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, సెక్రటరీ, గోరంత దీపం, కార్తీకర్తీ దీపం, చుట్టాలున్నారు జాగ్రత్త మొదలైన సినిమాల్లో చిరస్మరణీయమైన పాత్రలను పోషించారు. ఆమె ఆంగికం, వాచకం, అభినయం ఈ మూడు సూర్యకాంతంకు పెట్టనిట్ట ఆభరణాలు.

అవి విలక్షణంగా ఆమెకు కీర్తిని సంపాదించి పెట్టాయి. 1950లో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సంసారం’ సినిమా సూర్యకాంతం కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ చిత్రం ఆమెను కయ్యాలమారిగా..గయ్యాళి గంపగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఒకటా, రెండో ఎన్నో అవకాశాలు క్యూ కట్టాయి. సూర్యకాంతం కోసమే ప్రాతలను సృస్టించి, డైలాగులు రాయడం చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి ప్రముఖ నటులిద్దరు హీరోలుగా నటించిన సినిమాలో ఆమె పాత్ర పేరుతోనే ‘గుండమ్మ కథ’ తీశారంటే సూర్యకాంతం స్థాయి అర్థం చేసుకోవచ్చు.

తాను తింటూ నలుగురికి పెట్టడం ఆమెలోని గొప్ప లక్షణాల్లో ఒకటని సూర్యకాంతం గురించి తెలిసిన వారు చెబుతుండేవారు. సినిమాలో ఒకే రకం పాత్రల్ని ఎక్కువ సినిమాల్లో నటించిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సూర్యకాంతమే. దాదాపు 750పైగా సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయారు సూర్యకాంతం. మనుషుల్ని స్థాయితో సంబంధం లేకుండా అభిమానించేవారు. పండుగలు, పబ్బాలు వస్తే వర్కర్స్‌కు బోనస్ ఇచ్చే విశాల హృదయం సూర్యకాంతం సొంతం. 1950లో వచ్చిన “సంసారం” చిత్రంలో తొలిసారిగా అత్తగారి పాత్ర పోషించారు సూర్యకాంతం.

ఆ మేనేజర్ మతిమరుపు, సావిత్రి కెరీర్‌నే మార్చేసింది! భానుమతి ప్లేస్‌లో ‘మహానటి’..

ఆ తర్వాత వరుసగా ఆమెకు అలాంటి పాత్రలే వచ్చేవి. అయితే ప్రతీ పాత్రదీ ఓ వైవిధ్యమే. అందుకే మళ్ళీ మళ్లీ అలాంటి పాత్రలే చేస్తున్నా జనాలకు విసుగు పుట్టలేదు. ముఖ్యంగా ఆమె వాడే అచ్చ తెలుగు పదాలు, వాటి ఉచ్ఛారణ ప్రేక్షకులను కట్టిపడేసేవి. ఆమె వాచకాభినయం నభూతో నభవిష్యత్ అని చక్రపాణి లాంటి వారే మెచ్చుకున్నారు. పాత్రలు పోషిస్తున్నప్పుడు ఎలాంటి అసహజత్వాన్ని కనిపించనీయకుండా, కేవలం ముఖాభినయంతో ఆకట్టుకోవడం.. ఆ అభినయానికి మాట్లాడేటప్పుడు యాసను జతచేయడం సూర్యకాంతం ప్రత్యేకత.

అలాంటి సూర్యకాంతానికి హిందీ చిత్రాలంటే ఎంతో ఇష్టం. అశోక్ కుమార్ ఆమె ఫేవరెట్ నటుడు. సినిమాల్లో నటిస్తున్నప్పుడే అనేక రేడియో నాటికల్లో కూడా నటించారు సూర్యకాంతం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, ఇంగ్లీష్ భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడేవారు. దాదాపు 750 చిత్రాల్లో నటించిన సూర్యకాంతానికి 1994లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డాక్టరేటు ప్రదానం చేసింది. చిత్రంలో పాత్రపరంగా చిత్తూరు నాగయ్యను చెడామడా తిట్టి, సన్నివేశ చిత్రీకరణ పూర్తికాగానే కాళ్ల మీద పడి క్షమాపణ కోరిన సహృదయురాలు.

తనకు రావాల్సిన డబ్బు దగ్గర ఎంత కచ్చితంగా ఉండేవారో, అవసరంలో ఉన్నవాళ్లకు గుప్తదానాలు కూడా అంత మెండుగా చేసేవారు. ఇకపోతే ఆర్థిక లావాదేవీల విషయంలో కచ్చితంగా ఉండే ఈమె ఎవరిని అంత సులువుగా నమ్మేవారు కాదు.. చివరికి కారు పాడైతే మెకానిక్ ఇంటికి వచ్చి ఆమె కళ్ళ ముందే బాగు చేయాలట. సినిమా షూటింగులకు ఆమె మోసుకొచ్చే క్యారియర్లు, కొసరి వడ్డించే పిండివంటల గురించి పాతతరం నటులు పదేపదే చెప్పేవారు. వంటలపై ఓ పుస్తకం రాసి ప్రచురించారు కూడా. వ్రతాలు, పూజలు ఎక్కువగా చేసేవారు. సినిమాల్లో ఆమె వేసేవి గయ్యాళి అత్త వేషాలే అయినా.. వ్యక్తిగతంగా ఆమె చాలా సౌమ్యురాలు.

Sai Pallavi : ఆ విషయంలో సాయిపల్లవి, నిజంగా హైబ్రీడ్ పిల్లే..

చక్కని మాటతీరుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. మరణించడానికి కొద్ది రోజుల ముందు కూడా సావిత్రి స్మారక అవార్డు అందుకున్నారామె.. చివరగా నటించిన సినిమా ‘ఎస్.పి.పరశురాం’ ఏది ఏమైనా సూర్య కాంతం అభినయం భయపెట్టినా, ఆమె నటనను ఎంతగానో తెలుగువారు అభిమానించారు. అందుకే ఈ నాటికీ ‘గుండమ్మ ’గానూ, ‘గయ్యాళి గంగమ్మ ’గానూ జనంమదిలో నిలచిపోయారామె ఎడమచేయి విసురుతూ ఆమె చెప్పే డైలాగులకు జనం పడిపడి నవ్వేవారు. దాదాపు అయిదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 700కు పైగా చిత్రాల్లో నటించిన సూర్యకాంతం శతజయంతి వేడుకలు ఇటీవలే ప్రారంభమయ్యాయి.

By Sreedhar Vadavalli - Hyderabad

I'm Telugu content writer with 5 years of Experience. I can write any vertical articles but specialist in Latest News and Political News

Related Post