Prabhas Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ కన్ఫార్మ్.. లక్కీ డేట్‌‌కి సూపర్ హీరో ఎంట్రీ..

Prabhas Kalki 2898AD : ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898AD’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబర్‌లో ‘సలార్’ రిలీజ్ చేసిన ప్రభాస్, మే 9న ‘కల్కి’ మూవీతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్దమైపోతున్నాడు. అయితే ఇంతకుముందు ‘సాహో’, ‘ఆదిపురుష్’, ‘రాధేశ్యామ్’ మూవీస్‌కి కూడా ఓ డేట్ ప్రకటించి, ఆ తర్వాత వాయిదా వేశారు. ఆఖరికి ‘సలార్’ కూడా సెప్టెంబర్‌లో రావాల్సింది, డిసెంబర్‌లో వచ్చింది.

90’s – A Middle Class Biopic : డైరెక్టర్‌గా తొక్కేసినా, నిర్మాతగా సూపర్ సక్సెస్..

మరి ఈసారి ‘కల్కి’ని చెప్పిన టైమ్‌కి, చెప్పిన డేట్‌కి రిలీజ్ చేస్తారా? లేక మరోసారి ప్రభాస్ మూవీ వాయిదా పడుతుందా? అనేది చూడాలి. అయితే వైజయంతి మూవీస్‌కి ఈ మూవీ చాలా సెంటిమెంట్. వైజయంతి బ్యానర్‌లో వచ్చిన ఆల్‌టైం హిట్స్ ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’, ‘మహానటి’ సినిమాలు మే 9నే రిలీజ్ అయ్యాయి.. కాబట్టి లక్కీ డేట్‌ని టార్గెట్‌గా పెట్టుకుని వర్క్ ఫినిష్ చేస్తున్నారు..

Venu Swamy : 2024లో ఓ సూపర్ స్టార్ ఆరోగ్య సమస్యలతో సినిమాల నుంచి తప్పుకుంటాడు..

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ పూర్తి చేయడమే బాకీ అని టాక్. నిజానికి ‘కల్కి’ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ‘సలార్’ వాయిదా పడడంతో ‘కల్కి’పై ఆ ఎఫెక్ట్ పడింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కల్కి’ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పఠానీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 800 ఏళ్ల తర్వాత జరిగే కథతో తెరకెక్కుతున్న ‘కల్కీ’ మూవీలో ప్రభాస్ ఓ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నాడు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post