Guntur Kaaram Collection : ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సలార్’ మూవీకి ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సరైన ప్రమోషన్స్ చేయకుండా, హిందీలో ‘సలార్’ని రిలీజ్ చేశారు. అయినా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టింది ‘సలార్’ హిందీ వర్షన్. సరిగ్గా ప్రమోట్ చేసి, రిలీజ్ చేసి ఉంటే ఈజీగా రూ.300 కోట్లకు పైగా వచ్చేవి. ‘సలార్’కి వచ్చిన టాక్‌కి రూ.1000 కోట్లు కొల్లగట్టడం ఖాయమని అనుకున్నా.. ‘సలార్’ స్పీడ్ రూ.800 కోట్ల వరకే ఆగింది..
గుంటూరు కారం రివ్యూ : ఓన్లీ ఫర్ ఫ్యాన్స్.. మిగిలిన వాళ్లకి ఎక్కడం కష్టమే..
సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోవడంతో ‘సలార్’ థియేటర్ల నుంచి దాదాపు వెళ్లిపోయింది. హైదరాబాద్‌లో ‘సలార్’కి ఒకే ఒక్క సింగిల్ థియేటర్ మిగలగా, జనవరి 14న రిలీజ్ అయ్యే ‘నా సామి రంగ’ ఆ థియేటర్ని కూడా తీసుకోబోతోంది. అయితే మహేష్ ‘గుంటూర్ కారం’ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ‘సలార్’ కలెక్షన్లు పెరగడం ఖాయం.
‘సలార్’ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు తెచ్చి పెట్టింది… హిందీ వర్షన్‌కి మంచి లాభాలు వచ్చాయి. ‘గుంటూర్ కారం’ దెబ్బకు మిగిలిన ఏరియాల్లోనూ కలెక్షన్లు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని 96 శాతం చేరుకున్న ‘సలార్’, త్రివిక్రమ్ పుణ్యమాని ఆ మిగిలిన 6 శాతాన్ని రాబట్టేయొచ్చు..
Sankranthi Movies 2024 : సంక్రాంతి సినిమాల టార్గెట్ ఎంతంటే..?
‘గుంటూర్ కారం’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే, ‘సలార్’ కలెక్షన్లను ఇక్కడితో బ్రేక్ పడి ఉండేది. ఇప్పుడు సంక్రాంతికి సినిమాకి వెళ్లాలనుకునే యాక్షన్ లవర్స్‌కి ‘సలార్’ మంచి ఆప్షన్ అవుతుంది.