గుంటూరు కారం రివ్యూ : ఓన్లీ ఫర్ ఫ్యాన్స్.. మిగిలిన వాళ్లకి ఎక్కడం కష్టమే..

గుంటూరు కారం రివ్యూ : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడో సినిమా ‘గుంటూర్ కారం’. మొదటి రెండు సినిమాలు అతను, ఖలేజా కల్ట్ క్లాసిక్స్‌గా మిగలడంతో ‘గుంటూర్ కారం’పై అంచనాలు చాలా ఉన్నాయి. అదీకాకుండా చాలా రోజుల తర్వాత మహేష్ మాస్ అవతారంలో కనిపించడంతో ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరి ‘గుంటూర్ కారం’ ఆ అంచనాలను అందుకోగలిగిందా?

హనుమాన్ మూవీ రివ్యూ: No words, Only Goosebumps.. కంటెంట్ ఉన్న కటౌట్..

కథ విషయానికి గురూజీ కొత్త రాసింది, తీసిందేమీ లేదు. తల్లికి దూరమైన హీరో, తిరిగి ఆమె పొందేందుకు ఏం చేశాడు? అనేదే కాన్సెప్ట్. అయితే గురూజీ తీసిన సీన్స్, చాలా సినిమాల కథలు, సీన్స్ కళ్ల ముందు తిరుగుతాయి. మదర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇంట్రెర్వెల్ ముందు వచ్చే కొన్ని సీన్స్ తప్ప మిగిలినదంతా మహేష్ బాబు షో మాత్రమే…

అజ్ఞాతవాసి మూవీలో పవన్ కళ్యాణ్‌తో చేయించినట్టుగా వెకిలి చేష్టలు, కుప్పిగంతులు వేయించలేదని ఫ్యాన్స్ సంతోషపడాలంతే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్‌లో ఉండే పదును, చాలా రోజులుగా కనిపించడం లేదు. వరుసగా డబ్బింగ్ సినిమాలకు డైలాగ్స్ రాస్తూ, సొంత టాలెంట్ మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది..

Guntur Kaaram vs Hanuman Theaters issue : ఇచ్చినవే 4, అందులో 3 లాగేసుకున్నారు!

శ్రీలీలను మరోసారి డ్యాన్స్‌ల కోసమే వాడేశారు. వెన్నెల కిషోర్, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జయరామ్ మిగిలిన నటులంతా తమ పాత్రల్లో జీవించారు. వెన్నెల కిషోర్‌తో కామెడీ సీన్స్‌ కొన్ని వర్కవుట్ అయ్యాయి. మ్యూజిక్ థియేటర్లలో కూడా చాలా పాటలను, చాలా పాత సినిమాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని గుర్తుకు తెస్తే, అది తమన్ తప్పు కాదు..

నీరసంగా సాగే సినిమాలో అక్కడక్కాడా నెక్లెస్ గొలుసు, కుర్చీ మడతపెట్టి వంటి రీమిక్స్ సాంగ్స్ పెడితే.. జనాల్లో జోష్ వస్తుందనేది గురూజీ ఫార్ములా. ‘అత్తారింటికి దారేది’ వర్కవుట్ అయిన ఈ ఫార్ములా, ‘అల వైకుంఠపురంలో’ మూవీలో సక్సెస్ అయ్యింది. ఇందులోనూ పాట కాస్త కిక్ ఇచ్చినా, మొత్తంగా సినిమాపై ఉన్న అభిప్రాయాన్ని మాత్రం మార్చలేకపోయింది.

Guntur Kaaram Pre Release Event : మహేష్ ఓపెన్ అయితే, మందేసి వచ్చినట్టేనా! బాబు ఎమోషనల్ కామెంట్స్‌పై ట్రోల్స్..

మొత్తంగా బాబు ఊర మాస్ క్యారెక్టరైజేషన్, శ్రీలీల రొటీన్ డ్యాన్స్‌లు, గురూజీలో దిగజారిన రైటింగ్, అదే రొట్ట ‘త్రివిక్రమ్’ సేమ్ టెంప్లెట్ ఫార్ములాతో ‘గుంటూర్ కారం’ Strickly Only for Fans బొమ్మగా మారింది. కలెక్షన్ల కోసం మొదటి రోజు థియేటర్లన్నీ కబ్జా చేసినప్పుడే సినిమా మీద నమ్మకంలేకనే ఇలా చేశారని అర్థం చేసుకోవాల్సింది! అజ్ఞాతవాసి లాంటి గునపం మిస్ అయ్యిందని, మహేష్ ఫ్యాన్స్‌కి కాస్త రిలీఫ్ మిగిల్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post