Naga Chaitanya Thandel : ఆ రెండు సినిమాల్ని కలిపి కొడుతున్న చైతూ… తండేల్ వర్కవుట్ అయితేనా..

Naga Chaitanya Thandel
Naga Chaitanya Thandel

Naga Chaitanya Thandel : టాలీవుడ్‌లో ఇప్పుడు Raw and Rustic లుక్ ట్రెండ్ నడుస్తోంది. రామ్ చరణ్, రంగస్థలం మూవీలో ఇలాంటి లుక్‌తో మొదటిసారి తన నటనతో అందర్నీ మెప్పించాడు. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా నటుడిగా రాని గుర్తింపు, గుబురు గడ్డం లుక్ తెచ్చిపెట్టింది. 2023లో నాని ‘దసరా’ మూవీ కోసం ఇలా మారిపోయాడు. గుబురు గబ్బం, పెద్ద జట్టుతో లుంగీలో కనిపించి… ఊర మాస్ గెటప్‌లో రూ.100 కోట్లు కొల్లగొట్టాడు.

Nagarjuna Naa Saami Ranga : సంక్రాంతి సెంటిమెంట్ కోసం నాగ్ తొందరపడుతున్నాడా..!?

ఇప్పుడు నాగచైతన్య కూడా ఇదే లుక్ ట్రై చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ చేస్తున్న ‘తండేల్’ మూవీ గ్లిప్స్‌ విడుదలైంది. ఇందులో సముద్రంలో చేపలు పట్టే జాలరిగా చైతూ కనిపించాడు. భారత జాలరిని పాక్ పోలీసులు అరెస్ట్ చేయడం, అక్కడ మనవాళ్లు పడే నరక యాతనను ‘తండేల్’ మూవీలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది..

Meena 2nd marriage : ఒంటరిగా ఉంటే తప్పేంటి? రెండో పెళ్లిపై ప్రశ్నించిన జర్నలిస్టుకి షాక్ ఇచ్చిన మీనా..

హీరో కోసం సముద్రం ఇవతల ఎదురుచూసే హీరోయిన్‌గా సాయి పల్లవి కనిపిస్తోంది. ‘రోజా’, ‘సీతా రామం’ వంటి సినిమాల ప్రధాన కథ దాదాపు ఇదే. పాక్ పోలీసులకు హీరో చిక్కడం, అతని కోసం హీరోయిన్ ఎదురుచూడడం.. చందూ మొండేటి కూడా ఇదే కథను తన స్టైల్‌లో డీల్ చేయబోతున్నాడు. గత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. మరి ‘తండేల్’ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post