Sankranthi Movies 2024 : సంక్రాంతికి సినిమా పండగ మామూలుగా ఉండడం లేదు. ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి పందెంలో పోటీపడుతున్నాయి. లెక్క 8 ఉండాల్సిందే కానీ ‘ఈగల్’, ‘ఫ్యామిలీ స్టార్’ వెనక్కి తగ్గడం, డబ్బింగ్ సినిమాలు తెలుగులో లేటుగా వస్తుండడంతో నాలుగు సినిమాలు, నాలుగు స్థంబాలాట ఆడబోతున్నాయి.
Society of the Snow movie review : 45 మంది, 2 నెలలు, నరమాంసం తింటూ సాగించిన ఓ జీవన పోరాటం..
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ‘గుంటూర్ కారం’ మూవీయే భారీ మూవీ. ఈ మూవీకి కనీసం రూ.200 కోట్లు వస్తే కానీ హిట్టు కాదు. అదే రోజు రిలీజ్ అవుతున్న ‘హనుమాన్’ చిన్న సినిమాని తొక్కేస్తున్నారనే సింపథీ వాడి బీభత్సమైన పబ్లిసిటీ తెచ్చుకుంది. పేరుకి చిన్న సినిమా అని వాడుకున్నా, సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘గుంటూర్ కారం’ తర్వాత ఎక్కువ బిజినెస్ జరిగింది ఈ మూవీకే..
‘హనుమాన్’ మూవీ, ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లు వసూలు చేస్తే, హిట్టు మెట్టు ఎక్కుతుంది. వెంకటేశ్ 75వ చిత్రం ‘సైంధవ్’ టార్గెట్ కూడా గట్టిగానే ఉంది. ఈ మూవీని రూ.26 కోట్లకు అమ్మారు… ఇక ఆఖరున వస్తున్న నాగ్ ‘నా సామి రంగ’ మూవీకి రూ.18 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది..
నాగ్ గత సినిమాల రిజల్ట్, లేటుగా రిలీజ్ అవుతుండడంతో ‘నా సామి రంగ’ మూవీ బిజినెస్ రూ.20 కోట్లు కూడా దాటలేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్, కాస్త పాజిటివ్ టాక్ వస్తే.. ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ సినిమాలు హిట్టు కావడం పెద్ద కష్టమేమీ కాదు..