Guntur Kaaram Pre Release Event : మహేష్ బాబు ఇంట్రోవర్ట్. పెద్దగా మాట్లాడడు. సినిమా ఫంక్షన్లలో కూడా మహేష్ బాబు ఏదో మాటవరుసకి, మొహమాటానికి రెండు మూడు ముక్కలు చెప్పడం తప్ప… ఎమోషన్‌గా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే గుంటూర్లో జరిగిన ‘గుంటూర్ కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ ఫుల్లుగా ఓపెన్ అయ్యాడు.
‘గుంటూర్ కారం మూవీలో మీరో కొత్త మహేష్‌ని చూడబోతున్నారు. ఆ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్‌దే. అతను నాకు ఫ్యామిలీ మెంబర్‌లాగా! ఆయన వల్లే మా ఊర్లో, మన ఊర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. రెండేళ్లుగా నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో చూశాను. త్రివిక్రమ్, ప్రొడ్యూసర్‌గారు నాకు సపోర్ట్‌గా నిలిచారు.
మొదటిసారి నాన్నగారు లేకుండా నా ఫిల్మ్ రిలీజ్ అవుతోంది. అందుకే కొత్తగా ఉంది. నా సినిమా రిలీజ్ అయ్యాక ఇన్ని థియేటర్లలో ఆడింది, ఇంత వసూలు చేసింది అని నాన్నగారు ఫోన్ చేసి చెప్పేవారు. ఆ మాటలు వింటే నేను పడిన కష్టమంతా మరిచిపోయేవాడిని. దాని కోసమే ఈ సినిమాలు ఇవన్నీ. ఇకపైన మీరే నాకు అన్నీ… నాకు అమ్మా… నాన్న… అన్నీ మీరే!’ అంటూ వ్యాఖ్యానించాడు మహేష్ బాబు…
మహేష్ ఇలా ఎమోషనల్ అవ్వడంతో ఎంత తాగి వచ్చాడోనని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. బాబు, ఇంత ఓపెన్ అయ్యాడంటే కచ్ఛితంగా మందు కొట్టి ఉంటాడని కొందరు అంటుంటే, సినిమా మీద నమ్మకం లేకనే సింపథీ, సెంటిమెంట్ వాడుతున్నాడని మరికొందరు అంటున్నారు.. వాస్తవానికి మహేష్ ఎప్పుడూ తన సినిమాల కలెక్షన్ల విషయంలో ఇంత సీరియస్‌గా తీసుకోలేదు..
ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే దాన్ని నిర్మొహమాటంగా స్వీకరించేవాడు. ఆడని సినిమా, రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పుకునే టైపు అసలే కాదు. మహేష్‌కి ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న తల్లి ఇందిరా దేవీ, 2022 సెప్టెంబర్ 28న చనిపోయారు. ఆ తర్వాత రెండు నెలలకే తండ్రి కృష్ణ కూడా మరణించారు. అదే ఏడాది జనవరిలో అన్న రమేశ్ బాబు కూడా కన్నుమూశాడు..
చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..
ఒకే ఏడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేష్, చాలా రోజుల తర్వాత సొంత ఊర్లో, సొంత అభిమానులను కలిసినప్పుడు కాస్త ఎమోషనల్ బ్లాస్ట్ అవ్వడం కామన్! దీనికి సింపథీ కార్డు జోడించడం, మందు కొట్టి వచ్చాడని ట్రోల్స్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు.. అదీకాక సినిమాలో కంటెంట్ లేకపోతే ఏం చేసినా వర్కవుట్ కావనే విషయం మహేష్ బాబుకి బాగా తెలుసు..