Nagarjuna Naa Saami Ranga : గత 10 ఏళ్లలో అక్కినేని నాగార్జున, 10 సినిమాల్లో నటించాడు. అయితే ఇందులో సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ మినహా మిగిలిన సినిమాల్లో భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ఊపిరి’ మూవీ కూడా నష్టాలు తెచ్చిపెట్టగా, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘రాజు గారి గది 2’, ‘ఆఫీసర్’, ‘దేవదాస్’, ‘మన్మథుడు 2’, ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’ ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు కూడా కలెక్షన్లు సాధించడంలో ఢీలా పడ్డాయి..
అందుకే సంక్రాంతి సెంటిమెంట్‌ని పట్టుకున్న నాగార్జున, సంక్రాంతి కానుకగా ‘నా సామి రంగ’ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ‘నా సామి రంగ’ షూటింగ్, జనవరి 5 వరకూ జరిగింది. జనవరి 6 నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు కాబోతోంది. డబ్బింగ్, ఎడిటింగ్, రీ-రికార్డింగ్ పూర్తి చేసి, సెన్సార్‌కి పంపించేందుకు కేవలం వారం రోజుల సమయం మాత్రం ఉంది..
Venkatesh Saindhav Movie : వెంకీ కూడా ‘సైంధవ్’ దించుతున్నాడు! సంక్రాంతికి కొట్లాట తప్పదేమో..
వారం రోజుల్లో సినిమాని సెన్సార్‌కి సిద్ధం చేసి, రిలీజ్ చేయడమంటే అయ్యే పని కాదు. తొందర పడితే, క్వాలిటీలో లోపం రావచ్చు. హడావుడిగా ముగించే పనుల కారణంగా అసలుకే మోసం జరగొచ్చు.. అదీకాకుండా సంక్రాంతికి వస్తున్న ‘హనుమాన్’, ‘గుంటూర్ కారం’, ‘సైంధవ్’ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘నా సామి రంగ’ టీజర్ ఆకట్టుకున్నా, ప్రమోషన్స్ అనుకున్న విధంగా సాగడం లేదు. దీంతో థియేటర్లు కూడా చాలా తక్కువగా దొరికాయి.. పాజిటివ్ టాక్ వస్తే తప్ప, సేఫ్ అవ్వలేని పరిస్థితి. దీంతో నాగ్, సంక్రాంతి సెంటిమెంట్ కోసం తొందరపడడం కరెక్ట్ కాదని అంటున్నారు అక్కినేని అభిమానులు..