Hanuman V/s Guntur Karam Theater’s
సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల్లో స్టార్ హీరో లేని సినిమా ‘హనుమాన్’. మహేష్ బాబు ‘గుంటూర్ కారం’ మూవీకి పోటీగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది ‘హనుమాన్’. ఈ సినిమాని జనవరి 10కి లేదా జనవరి 15కి వాయిదా వేయమని దిల్ రాజు చెప్పినా, నిర్మాత నిరంజన్ రెడ్డి పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్‌లో 96 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే, 90 థియేటర్లలో ‘గుంటూర్ కారం’ మూవీని దించుతున్నాడు దిల్ రాజు..
‘హనుమాన్’ మూవీకి 5-6 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే దక్కాయి. ‘వాళ్లు రూ.150 కోట్లు పెట్టి, పెద్ద స్టార్‌తో సినిమా తీశారు. నేను రూ.70 కోట్లు పెట్టి సినిమా తీశాను. అనుకున్న బడ్జెట్‌కి 5 రెట్లు పెరిగింది. అయితే దానికి కావాల్సిన బజ్ క్రియేట్ చేయగలిగాం. కానీ మాకు అనుకున్నన్ని థియేటర్లు ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో 90 థియేటర్లలో వాళ్ల సినిమా రిలీజ్ అవుతోంది.
Prashanth Varama : హనుమాన్ సక్సెస్ అయితే, అవతార్ రేంజ్లో మూవీ తీస్తా… ప్రశాంత్ వర్మ కామెంట్స్…
ఇది ఏకస్వామ్యం అంటారా? లేక తొక్కేయడం అంటారా? మీరే చెప్పాలి. మాకు సగం థియేటర్లు ఇవ్వమని మేం అడగడం లేదు. 15-20 థియేటర్లు అయినా ఇవ్వమని అడుగుతున్నాం. చాలా థియేటర్ల యజమానులు, మాకు ఫోన్ చేసి మేం హనుమాన్ విడుదల చేయాలని అనుకుంటున్నాం. కానీ వేయనివ్వడం లేదని చెబుతున్నారు. ఇది ఎంత వరకీ కరెక్ట్’ అంటూ కామెంట్ చేశాడు ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి…