ఓ ఆడది ఒంటరిగా ఉందంటే చాలు, అడ్డమైన కుక్కలన్నీ అవకాశం తీసుకోవడం కూడా చూస్తాయి. ఏడాదిన్నరగా ఒంటరి జీవితం గడుపుతున్న మీనా పరిస్థితి కూడా ఇదే. మిగిలిన హీరోయిన్లకు భిన్నంగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని ఓ సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని వివాహం చేసుకుంది మీనా. అయితే 13 ఏళ్ల కాపురం తర్వాత మీనా భర్త విద్యా సాగర్ అనారోగ్యంతో మరణించారు..
2022లో విద్యాసాగర్ మరణించినప్పటి నుంచి మీనా రెండో పెళ్లి గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. మీనా రెండో పెళ్లి చేసుకుందని, వరుడు ఇతనేనంటూ యూట్యూబ్‌లో రకరకాల Thumbnails క్రియేట్ చేస్తూ రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకి హాజరైన మీనాకి ఇదే ప్రశ్న ఎదురైంది. రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని మీసాలకు రంగు వేసుకున్న ముసలి రిపోర్టర్ ప్రశ్నించాడు..
Jr NTR Devara : వైజాగ్ అంటే.. భయపడుతున్న యంగ్ టైగర్..
దానికి మీనా షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ‘లోకంలో చాలా మంది మహిళలు ఒంటరిగానే బతుకుతున్నారు. నాక్కూడా ఈ ఒంటరి జీవితం నచ్చింది. ఎన్నాళ్లు ఇలా ఉండగలనో చూద్దాం. ఉండనివ్వండి… అయితే రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇంతవరకూ రాలేదు. ఇకపైన వస్తుందేమో తెలీదు. అలా ఆలోచన వచ్చినప్పుడు కూడా ముందు నా కూతురు గురించి ఆలోచించాలి… అన్నీ కుదిరితే చేసుకోవచ్చు, లేదా ఇలాగే ఒంటరిగానే ఉండిపోవచ్చు.. ’ అంటూ కామెంట్ చేశారు సీనియర్ హీరోయిన్ మీనా…
వెంకటేశ్‌తో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన మీనా, కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.