Mahesh Babu Guntur Kaaram : ఒకే రోజు 4 సినిమాలు, 2 రోజుల్లో మరో 3 సినిమాలు.. గుంటూరోడికి శానా కష్టమే..

Mahesh Babu Guntur Kaaram : ఏడాదిన్నర గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా థియేటర్లలోకి వస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్స్ తర్వాత మహేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘గుంటూరు కారం’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీగా జరిగింది.

బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.160 కోట్లకు ‘గుంటూరు కారం’ థియేటర్ రైట్స్ విక్రయించినట్టు సమాచారం. అయితే సంక్రాంతికి థియేటర్ల దగ్గర భారీగా పోటీ జరుగుతోంది. జనవరి 12న ‘గుంటూరు కారం’ మూవీతో పాటు మరో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ‘హనుమాన్’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లు దక్కాయి..

అలాగే డబ్బింగ్ మూవీస్ ‘అయాలన్’, ‘కెప్టెన్ మిల్లర్’ కూడా జనవరి 12నే విడుదల అవుతున్నాయి. మహేష్ బాబు సినిమాయే ఫస్ట్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి, ‘గుంటూరు కారం’ మూవీకి భారీగా థియేటర్లు దక్కొచ్చు. అయితే క్లీన్ స్వీప్ కుదరదు.

‘జల్సా’ కోసం మహేష్.. ‘గుంటూరు కారం’ కి తిరిగి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..

జనవరి 13న ‘ఈగల్’, ‘సైంధవ్’ విడుదల అవుతుంటే, జనవరి 14న ‘నా సామి రంగ’ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని వెంకీ, నాగార్జున పట్టుకుపోతారు. ఆంధ్రాలో ఈ మూవీకి మంచి థియేటర్లు దక్కాయి. దీంతో ఎంత ట్రై చేసినా ‘గుంటూర్ కారం’ మూవీకి అనుకున్నన్ని థియేటర్లు దక్కలేదుట. దీంతో ‘గుంటూర్ కారం’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి, లాంగ్ రన్‌లో కనీసం రెండు వారాలు ఆడితే కానీ హిట్టు స్టేటస్ దక్కించుకోలేని పరిస్థితి..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post