Prashanth Varma : గుంటూరు కారం మూవీకి పోటీగా అదే రోజు విడుదల అవుతున్న తెలుగు మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ హీరోగా చేస్తున్న ‘హనుమాన్’ మూవీ, తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల అవుతోంది. ఇప్పటికే చిన్న సినిమాని తొక్కేయాలని చూస్తున్నారంటూ సింపథీ గేమ్ ఆడుతూ మంచి పబ్లిసిటీ దక్కించుకుంది ‘హనుమాన్’..
కొన్నిసార్లు సైకిల్‌తో గుద్దితే కారుకి కూడా సొట్ట పడొచ్చని తన సినిమా మీద పూర్తి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన ప్రశాంత్ వర్మ, ‘హనుమాన్’ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..
‘హనుమాన్ మూవీ వల్ల వీఎఫ్‌ఎక్స్ వర్క్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇది సక్సెస్ అయితే, వెంటనే అవతార్ రేంజ్‌లో ఓ భారీ వీఎఫ్‌ఎక్స్ మొదలెడతా. వీఎఫ్‌ఎక్స్‌తో అవతార్ లాంటి కొత్త ప్రపంచాలను సృష్టించడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్, హనుమాన్ ఇస్తుందని నమ్ముతున్నా..’ అంటూ కామెంట్ చేశాడు ప్రశాంత్ వర్మ..
ఫ్లాప్ హీరోలకి హిట్టు దేవతగా మారిన శ్రుతి హాసన్.. ఆఖరికి ప్రభాస్‌కి కూడా..
ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో భాగంగా వరుసగా 12 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మొదటి సినిమా ‘హనుమాన్’. ఈ మూవీ తర్వాత ‘అధీర’ అని రెండో సినిమా రానుంది. ఈ విధంగా భారత పురాణాల్లోని పాత్రలోనే 12 సూపర్ హీరోల సినిమాలు తీసి, అందరినీ కలుపుతూ ఓ మహాభారతం లాంటి మూవీ తీయాలని అనుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ ప్లాన్ వర్కవుట్ కావాలంటే ముందుగా ‘హనుమాన్’ సక్సెస్ కావాలి..