Jigar Thanda Movie Review :
2014లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘జిగర్తాండా’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన మూవీ ‘జగర్తాండా డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో రాఘవ లారెన్స్, ఎస్.జె. సూర్య, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఫేక్ వీడియోలు చేయడం కూడా నేరమే! రష్మిక వీడియోపై మొదలైన రచ్చ..
‘జిగర్ తాండా’ మూవీని తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’ పేరుతో రీమేక్ చేశాడు హరీశ్ శంకర్. ఓ రౌడీ జీవిత కథను సినిమాగా తీసేందుకు దర్శకుడు పడే తిప్పలే ‘జిగర్తాండా’. దీని సీక్వెల్ విషయంలోనూ ఇదే కథను ఎంచుకున్న కార్తీక్ సుబ్బరాజు, ‘సిల్వర్ స్క్రీన్ మీద మొట్టమొదటి నల్లని సూపర్ స్టార్’ అంటూ ఓ పాయింట్‌ని కొత్తగా జోడించాడు.
ఈ మధ్య దర్శకుడిగా కంటే, నటుడిగానే తెగ బిజీ అయిపోయాడు ఎస్.జె. సూర్య. ‘మానాడు’ ‘కాలేజీ డాన్’, ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన ఎస్.జె. సూర్య, ‘జిగర్ తాండా డబుల్ ఎక్స్’లో దర్శకుడిగా నటించాడు. ఈ మూవీని సూర్య యాక్టింగ్ వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది.
కేజీఎఫ్‌కి ముందు యష్ ఎవడు? అల్లు అరవింద్ కామెంట్..
రాఘవ లారెన్స్ నటుడిగా చాలా మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ చూపించాడు. సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆయువు పట్టు. తిరు సినిమాటోగ్రఫీ, 1970ల్లో సినిమాటిక్ వాతావరణం క్రియేట్ చేసిన ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఆకట్టుకుంటాయి.
ఫస్టాఫ్‌లో కాస్త నెమ్మదిగా సాగే సినిమా, ఇంటర్వెల్‌కి అదిరిపోయే ట్విస్ట్‌తో ముగుస్తుంది. సెకండాఫ్‌పై చాలా ఫోకస్ పెట్టిన కార్తీక్ సుబ్బరాజు, బెస్ట వర్క్ ఇచ్చాడు. ముఖ్యంగా చివరి 30-40 నిమిషాలు, ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ సినిమా మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. తెర వెనక జరిగే విషయాల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఈ మూవీ కచ్ఛితంగా నచ్చుతుంది.
బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..