Bubble Gum Movie Review : టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల పెద్ద కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన మూవీ ‘బబుల్ గమ్’. టీజర్, ట్రైలర్, పోస్టర్లలోనూ యూత్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా అనిపించిన ‘బబుల్ గమ్’ మూవీ, సుమ కొడుక్కి హిట్టు ఇచ్చిసినట్టేనా…
మీ భాషాభిమానం తగలెయ్యా! బెంగళూరులో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సీన్స్..
‘క్షణం’, ‘కృష్ణ అండ్ హీస్ లీల’ సినిమాలతో దర్శకుడిగా నిరూపించుకున్న రవికాంత్ పేరేపు, మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘బబుల్ గమ్’ మూవీ తెరకెక్కించాడు. డీజే కావాలని కలలు కనే కుర్రాడు, అనుకోకుండా పబ్‌లో హీరోయిన్ని కలుస్తాడు. అబ్బాయిల్ని కేర్ చేరని హీరోయిన్ని, హీరో లవ్‌లో ఎలా పడేశాడు. పెద్దలను ఎదురించి, ఆమెను ఎలా దక్కించుకున్నాడు..
కథకు తగ్గట్టుగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘బబుల్ గమ్’ మూవీలో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు నిండుగా ఉన్నాయి. ఇవి కాస్త తగ్గించి ఉంటే, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ మూవీ నచ్చేది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్, మొదటి సినిమాలోనే నటుడిగా ఎంతో మెచ్యూరిటీ చూపించాడు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మానస చౌదరి కూడా బాగా నటించింది..
డెవిల్- ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ రివ్యూ: కళ్యాణ్‌రామ్ హిట్టు, డైరెక్టర్ మాత్రం..
తరతరాలుగా ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా చెప్పడానికేమీ లేదు. కథలో కొత్తదనం లేకున్నా కథనంతో ఆకట్టుకోవడమే తెలియాలి. ఈ విషయంలో ‘బబుల్ గమ్’లా యూత్‌కి అతుక్కుపోయే కథను తన స్టైల్లో ప్రెసెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఓవరాల్‌గా ‘బబుల్ గమ్’ యూత్‌కి మాత్రమే!