Kalyan Ram’s Devil Movie Review : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీతో మొదలైన 2023 ఏడాది, నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన ‘డెవిల్’ మూవీతో పూర్తి అయ్యింది. డిసెంబర్ 29న ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ మూవీ విడుదలైంది. డైరెక్టర్ని మార్చడం, డైరెక్టర్ పేరే లేకుండా నిర్మాతే తన పేరు వేసుకోవడంతో ‘డెవిల్’ మూవీ వార్తల్లో నిలిచింది.. తానే డైరెక్ట్ చేశానని చెప్పుకున్న నిర్మాత అభిషేక్ నామా, ‘డెవిల్’ కచ్ఛితంగా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని ధీమాగా ప్రకటించాడు. మరి ‘డెవిల్’ మూవీలో అంత దమ్ముందా?…
హద్దుల్లేని ప్రేమ.. ఆమె కోసం అతడిగా మారి.. చివరకు విషాదాంతమై..
1940ల్లో ఓ ఊరిలో జరిగిన దొరసాని హత్య, ఆ కేసును దర్యాప్తు చేసేందుకు వచ్చిన బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్‌రామ్.. ఇలా ఫస్టాఫ్ కథ అంతా యావరేజ్‌గా సాగింది. తర్వాత ఏం జరగబోతుందో ప్రేక్షకులకు ముందే అర్థమైపోతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ రక్తి కడుతుంది. కొన్ని ట్విస్టులతో ‘డెవిల్’ ముగుస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బాగుందనిపించినా… ట్రైలర్లోనే ట్విస్టులన్నీ బయటపెట్టేయడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వరు..
‘డెవిల్’గా నందమూరి కళ్యాణ్‌రామ్ మరోసారి తన బెస్ట్ పర్ఫామెన్స్ చూపించాడు. సంయుక్త మీనన్, తన పాత్రలో చక్కగా ఒదిగింది. మాళవిక నాయర్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య వారి పాత్రల్లో చక్కగా నటించారు.
‘డెవిల్’ రిలీజ్‌కి ముందు ‘డైరెక్టర్’ గొడవ.. నేనంటే నేనేనంటూ..
కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్‌కి కథ, కథనంతో పాటు అన్ని విభాగాలపైన పట్టు ఉండాలి. ‘డెవిల్’ మూవీ విషయంలో కథ, కథనం బాగున్నా దాన్ని స్క్రీన్ మీద ‘థ్రిల్లింగ్’గా ప్రెసెంట్ చేయడంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఈ మూవీ తానే తీశానని నవీన్ మేడారం చెప్పుకొచ్చాడు. కాదు, తానే మొత్తంగా దర్శకత్వం చేశానని అభిషేక్ నామా ప్రకటించుకున్నాడు. కథపై నమ్మకంపై వీరిలా గొప్పగా చెప్పుకున్నా, కంటెంట్‌గా డెలివర్ చేయడంలో మాత్రం దర్శకత్వ ప్రతిభ లోపించినట్టే కనిపించింది.